24 మందిని బలిగొన్న అంఫాన్ తుఫాన్

24 మందిని బలిగొన్న అంఫాన్ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్ప‌డిని అంఫ‌న్ తుఫాన్ క‌ల్లోలం సృష్టిస్తోంది.ఈ తుఫాన్ ప్ర‌భావంతో ప‌శ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల‌లో సుమారు 24 మంది మృతి చెందారు. నిన్న మ‌ధ్యాహ్నం గం.2: 30 తీరం దాటిన ఈ తుఫాన్ రెండు రాష్ట్రాలలో విధ్వ‌సం సృష్టించింది. సుమారు 185 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీయ‌డంతో చెట్లు, క‌రెంటు స్థంభాలు నేల‌కొరిగాయి. భారీ ఎత్తున ఆస్తి న‌ష్టం జ‌రిగింది.

అయితే తుఫాన్ ప్ర‌భావంపై బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. న‌ష్టాన్ని ఇప్ప‌ట్లో అంచనా వేయ‌లేమ‌న్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్, ఫోన్ లైన్లు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల కనెక్టివీటీని కోల్పోయామ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం తాము మూడు సంక్షోభాలను ఎదుర్కొంటున్నామ‌ని అన్నారు. కర‌నా వైర‌స్ ప్ర‌భావంతో దెబ్బ‌తిని ఇంటికి తిరిగి వ‌స్తున్న  వేలాది మంది వ‌ల‌స‌దారుల‌ది ఒక స‌మ‌స్య అయితే ఇప్పుడు తుఫాన్ రూపంలో మ‌రో స‌మ‌స్య ఎదురైంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బంగ్లాదేశ్‌లో కనీసం లక్ష మంది ప్రజలు విద్యుత్ లేకుండా ఉన్నారని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.