క‌రోనా వైర‌స్ వ‌స్తుంద‌న్నా విన‌కుండా ‘పోకేమాన్’ ఆడిన తాత‌...

క‌రోనా వైర‌స్ వ‌స్తుంద‌న్నా విన‌కుండా ‘పోకేమాన్’ ఆడిన తాత‌...

 

బయటకు రావద్దు.. కరోనా సోకితే పోతావ్.. అంటూ ప్రభుత్వాలు, పోలీసులు హెచ్చరించినా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇక కుర్రకారైతే దీన్ని హాలీడేస్‌గా భావించి ఖాళీ రోడ్లపై చక్కర్లు కొడుతూ టిక్‌టాక్‌లు చేస్తున్నారు. యువకులకు కరోనా రాదనే భ్రమతో తెగ తిరిగేస్తున్నారు. కానీ, రెండో దశలోకి వచ్చిన కరోనా.. వాళ్లు వీళ్లు అని చూడకుండా ఎటాక్ చేస్తోంది. 

యువకుల్లో కరోనా వచ్చినా.. లక్షణాలు చూపించకుండా స్లో పోయిజన్‌లా అవయవాలను నాశనం చేస్తోంది. ఇక పెద్దల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వృద్ధులనైతే బయట కాలు పెట్టాలనే ఆలోచనే చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

క‌రోనా వైర‌స్ వ‌స్తుంద‌న్నా విన‌కుండా ‘పోకేమాన్’ ఆడిన తాత‌...

కరోనా నేపథ్యంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో కూడా లాక్‌డౌన్ విధించారు. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు. నిబంధన ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, రోడ్లు ఖాళీగా ఉంటాయనే ఉద్దేశమో.. తనకు కరోనా రాదనే విశ్వాసమో తెలీదుగానీ.. 77 ఏళ్ల తాత తన మొబైల్‌ను చూస్తూ వీధుల్లో తిరిగాడు. దీంతో పోలీసులు అతడిని అడ్డుకున్నారు. బయటకు ఎందుకు తిరుగుతున్నావ్? అని ప్రశ్నిస్తే.. తాను పోకేమాన్ ఆడుతున్నానని చెప్పాడు.

ఈ విషయాన్ని మాడ్రిడ్ పోలీసులు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. పోకేమాన్, కార్, డైనోసార్ల వంటి మ్యాజికల్ క్రీచర్స్‌ ఆడుతూ వీధుల్లోకి రావడం నిషేదం. అలా వచ్చినవారిని విడిచిపెట్టం’’ అని పోలీసులు ట్వీట్ చేశారు. పోకేమాన్ ఆడుతున్న ఆ తాతను అరెస్టు చేయడంతోపాటు భారీ జరిమానా విధించామని తెలిపారు.