ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ యాప్ తప్పనిసరి

ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఆరోగ్య సేతు’ కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ యాప్ తప్పనిసరి

 

ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘ఆరోగ్య సేతు’ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ తప్పనిసరి చేసినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉద్యోగులలో ఈ యాప్ 100 శాతం కవరేజీని నిర్ధారించడం సంబంధిత సంస్థల అధికారుల బాధ్యతగా పేర్కొంది. కరోనావైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఇప్పటికే మే3 వరకు రెండోసారి పొడిగించింది. 

ఇప్పుడు మరో 14 రోజులు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. "సమగ్ర సమీక్ష చేయడంతో పాటు లాక్ డౌన్ చర్యలతో COVID-19 వ్యాప్తి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. ఆరోగ్యా సేతు యాప్ మొబైల్ యాప్.. ఇది కరోనావైరస్ ముప్పును ముందే యూజర్‌ గుర్తించేలా లొకేషన్, బ్లూటూత్, అల్గోరిథంలు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ దీనిని ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం అభివృద్ధి చేసింది.

ఈ యాప్ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన 13 రోజుల్లో 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను అధిగమించింది. భారతదేశం కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఇటీవల ప్రారంభించిన 30 రోజుల్లో 75 మిలియన్ డౌన్‌లోడ్ మార్కును దాటింది. కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని పీఎం మోడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తదితరులు ప్రోత్సహించారు. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, తమిళం, బెంగాలీ, ఒరియా, తెలుగు భాషలతో సహా 11 భాషలకు సపోర్ట్ ఇస్తుంది. ఈ యాప్ విధులను బాగా అర్థం చేసుకోవడానికి మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకోవచ్చు. 

యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, యూజర్లు Sign Up చేసి జెండర్ పేరు, వయస్సు, వృత్తి వంటి వ్యక్తిగత సమాచారాన్ని నింపాలి. కరోనావైరస్‌ను సోకే ప్రమాదం ఉందా అని నిర్ధారించడానికి అప్లికేషన్ యూజర్లకు దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందా అని అడుగుతుంది. యూజర్లకు వారి ఆరోగ్య పరిస్థితి స్థితి గురించి తెలియజేస్తుంది. అవసరమైన ఆరోగ్య సేవలకు అనుసంధానం చేస్తుంది.