జాక్‌మా 54ఏళ్లకే పదవీ విరమణ

0
201
JACK MA RETIRE

చైనీస్‌ ఇ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌, చైనా అత్యంత సంపన్నుడు జాక్‌ మా సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సోమవారం(సెప్టెంబరు 10) తాను రిటైర్‌మెంట్‌ తీసుకోనున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ తర్వాత ఫిలాంత్రఫీ కోసం సమయం కేటాయిస్తానని చెప్పారు. సోమవారం జాక్‌ మా 54వ పుట్టినరోజు. అదే రోజు పదవీ నుంచి రిటైర్‌ అవుతానని వెల్లడించారు.

ఇంగ్లిష్‌ టీచర్ అయిన జాక్‌ మా 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి అలీబాబాను స్థాపించారు.శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే నాటికి కంపెనీ విలువ 420.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్‌ మా సంపద విలువ ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం 38.6బిలియన్‌ డాలర్లుగా ఉంది.

అన్నట్లుగానే సోమవారం రిటైర్మెంట్‌ తీసుకోనున్నట్లు నేడు సంచలన ప్రకటన చేశారు. ‘నా 54వ పుట్టినరోజు నాడు నేను కంపెనీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.