దీపావళి వేళ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం..!!

0
191
Allu arjun

అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాడు. పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరికొద్ది రోజుల్లోనే శుభవార్త చెప్పేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నా. నా కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూసిన నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నా. మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెల్లడిస్తాను. మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నాడు. ‘నా పేరు సూర్య’ సినిమా ఆశించిన మేర ఫలితం రాబట్టక పోవటం, ఆ తర్వాత బన్నీ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో జాప్యం కావటం.. ఆయన అభిమానులను కాస్త నిరాశపరిచాయి. అయితే బన్నీ చేసిన తాజా ట్వీట్ తిరిగి అందరిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.