5 రోజుల్లోనే రూ.15,000 కోట్లు

0
65
amazon and flipkart reaches 15000 crores in 5 days

అమెజాన్‌

గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ పేరిట జరిపిన విక్రయాల్లో భారీ వృద్ధి లభించింది. గతేడాది జరిగిన కొనుగోళ్ల సంఖ్యను, ఈ ఏడాది 36 గంటల్లోనే అధిగమించాం. అన్ని విభాగాల్లో అంచనాలను మించి అమ్మకాలు జరిపాం. తొలిసారిగా మా పోర్టల్‌లో కొనుగోళ్లు జరిపిన వారిలో 80% మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారు. ఆర్డర్ల విలువ పరంగా చూస్తే, అధికభాగం సెల్‌ఫోన్ల నుంచే ఉన్నాయి. అదే సంఖ్యాపరంగా ఫ్యాషన్‌ (దుస్తులు, ఇతరాలు) నుంచి వచ్చాయి. కొత్త ఖాతాదారులను ఆర్జించడంలో ఫ్యాషన్‌ విభాగానిదే కీలకపాత్ర. ఇందులో 63% 2-3 అంచె పట్టణాల నుంచి లభించాయి. మొత్తం వినియోగదారుల్లో మూడింట రెండొంతుల మంది మార్పిడి, నెలవారీ వాయిదాలు, బ్యాంకుల ఆఫర్లను వాడుకున్నారు. హిందీ భాషలో రూపొందించిన అమెజాన్‌ వెబ్‌సైట్‌పై, సాధారణ రోజుల ఖాతాదార్లతో పోలిస్తే, 2.4 రెట్లు అధికంగా కొత్త ఖాతాదారులు కొనుగోళ్లు జరిపారు.

ఫ్లిప్‌కార్ట్‌

దేశీయ రిటైల్‌ రంగంలో ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకు పోయేలా  బిగ్‌బిలియన్‌ డేస్‌ అమ్మకాలు సాగాయి. ఈ 5 రోజుల్లో ‘ఇకామర్స్‌’ పోర్టళ్లు జరిపిన  అమ్మకాల్లో 70% వాటా మాదే. గతేడాది కంటే, ఈ ఏడాది జరిగిన స్థూల అమ్మకపు విలువ 80 శాతం పెరిగింది. వస్తువుల సంఖ్యా పరంగా రెండు రెట్ల వృద్ధి లబించింది. విలువ పరంగా ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తుల అమ్మకాల్లో 85 శాతం, మన్నికైన వినియోగ ఉత్పత్తుల్లో 75 శాతం మాదే. ప్రతి 4 స్మార్ట్‌ఫోన్లలో 3 మా ప్లాట్‌ఫాం నుంచే అమ్ముడయ్యాయి. కొత్త ఖాతాదారుల పరంగా 50% వృద్ధి లభించింది. ప్రతి ఇద్దరిలో ఒకరు నెలవారీ వాయిదాలు, బ్యాంక్‌ ఆఫర్లు వినియోగించుకున్నారు. వాల్‌మార్ట్‌ మా సంస్థను కొన్నాక, ఇంత భారీ అమ్మకాలు జరిగాయి.

పేటీఎం మాల్‌: 

1.2 కోట్ల ఉత్పత్తులు విక్రయించాం. సాధారణ రోజులతో పోలిస్తే, లావాదేవీలు 5 రెట్లు పెరిగాయి. దాదాపు 6 కోట్ల మంది మా ప్లాట్‌ఫామ్‌ను సందర్శించారు. 2 లక్షల మంది వ్యాపారులు తమ సరకు విక్రయించారు.