నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు, లోకేష్ పర్యటన

chandrababu naidu visit srikakulam

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు మందసలో తుఫాను బాధితులకు మంత్రి లోకేష్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు పలాస రైల్వేగ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తుఫాను బాధితులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 19 మండలాల్లో 4.60 లక్షల మంది బాధితులకు రూ.530 కోట్ల మేర పరిహారాన్ని చంద్రబాబు, లోకేష్‌ పంపిణీ చేయనున్నారు.