ఫుల్ జోష్ లో జగన్..

ఫుల్ జోష్ లో జగన్..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించిన జగన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పలు విషయాలపై నిశితంగా చర్చించారు. అయితే రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కానున్నారు. భేటీలో భాగంగా మూడు రాజధానులు, రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం నిధులు, శాసనమండలి రద్దు తీర్మానంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

అయితే.. ఒక్క రోజు గ్యాప్‌లోనే రెండోసారి జగన్ ఢిల్లీలో పర్యటించడంతో ఏపీ రాజకీయాల్లో సర్వ్రతా చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ వరుస పర్యటనలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు మోదీతో జరిగిన భేటీలో ఆయన ముందు పలు విషయాలను ప్రస్తావించగా అమిత్ షాను కలిసి వాటిపై చర్చించాలని చెప్పినట్లు తెలియవచ్చింది. దీంతో బుధవారం, గురువారం నాడు షా బిజిబిజీగా ఉండటంతో అపాయింట్‌మెంట్‌  దొరకలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాడు షా అపాయింట్‌మెంట్‌  దొరికిందని, ఆయనతో జగన్ భేటీ అయ్యి అన్ని విషయాలను చర్చిస్తారని సమాచారం. 

మోదీ అపాయింట్‌మెంట్‌  కే టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. గంటన్నర పాటు మోడీ, జగన్ ల భేటీ కావడం తో జగన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఢిల్లీ నుండి వచ్చినప్పుడు కూడా అదే ఎనర్జీ జగన్ లో కనిపించింది. ఇప్పుడు మోడీ తో భేటీ అయిన వెంటనే అమిత్ షా అపాయింట్‌మెంట్‌  ఇచ్చారు. హోమ్ శాఖ పరిధిలో ఉన్నవన్నీ త్వరగా క్లియర్ చెయ్యాలని మోదీ ఆదేశించడంతో అమిత్ షా హుటాహుటిన సీఎం జగన్ ను పిలిపిస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కావడం తో రాష్ట్రానికి అవసరమైన నిధులు కూడా వస్తాయన్న ధీమా వ్యక్తమవుతోంది. దీంతో అమిత్ షా తో జగన్ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది.