శవపేటికలో దూరిన మేయర్.. చావు తెలివితేట‌లు

శవపేటికలో దూరిన మేయర్.. చావు తెలివితేట‌లు

 

త‌ప్పుచేసి పోలీసుల‌కు దొర‌క‌కుండా ఉండేందుకు ఓ వ్య‌క్తి చావు తెలివితేట‌లు వాడాడు.. పోలీసులు రాగానే శ‌వ‌పేటిక‌లో దూరిపోయాడు. కానీ అత‌ని అతి తెలివితేట‌లు క‌నిపెట్టిన పోలీసులు క‌నిపెట్టేసారు... అరెస్ట్ చేసారు. 

వివ‌రాల్లోకి వెళితే.. ఆయన పేరు జేమీ రొలాండో..పేరూ దేశంలోని ఓ టౌన్‌కు మేయర్. చట్టాన్ని అమలు పరిచే అధికారమే కాకుండా స్వయంగా తనూ దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉన్నవారు. కానీ ఆయనే చట్టాన్ని ఉల్లంఘించారు. లాక్ డౌన్ అమల్లో ఉందన తెలసీ తన స్నేహితుల మందు పార్టీకి వెళ్లారు. బాగా మద్యం సేవించి మజా చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలిసింది. 

మేయర్‌ను అదుపులోకి తీసుకునేందుకు వారు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు లొంగిపోయేందుకు మేయర్ మనసొప్పలేదు. తప్పు ఒప్పుకుని పరువు నిలబెట్టుకునేందుకు బదులుగా పోలీసులను బురిడీ కొట్టించాలనుకున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు జేమీ ఏకంగా శవపేటికలో దూరి చనిపోయినట్టు నటించారు. 

అయితే మేయర్ పథకం పారకపోవడంతో పోలీసులకు దొరికిపోయారు. ఆయన శవపేటికలో మాస్కు పెట్టుకుని పడుకుని ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.