రాజకీయాల్లోకి బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్

రాజకీయాల్లోకి బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్

సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజాసేవ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖ క్రీడాకారులు రాజకీయాల్లోకి వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ లో చేరిన స్టార్ట్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. బుధవారం ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నారు. 

హర్యానాలో జన్మించిన సైనా నెహ్వాల్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించారు సైనా. 2015 లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన మొదటి భారతీయ మహిళగా సైనా రికార్డు సృష్టించారు. 2018లో తోటి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ తో సైనాకు వివాహం జరిగింది.