గాలి జనార్ధనరెడ్డికి బెయిల్ మంజూరు

gali janardhana reddy bail granted

యాంబిడంట్‌ ముడుపుల కేసులో గత ఆదివారం అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దనరెడ్డికి బుధవారం బెయిలు మంజూరైంది. జనార్దనరెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో సీసీబీ (కేంద్ర నేర విచారణ విభాగం) సక్రమంగా వ్యవహరించలేదనీ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి జనార్దనరెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. కాగా, తనకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కల్పించాలంటూ హోం మంత్రి పరమేశ్వరను జనార్దనరెడ్డి కోరారు.రూ.లక్ష పూచీకత్తుతో బాండ్.. ఇద్దరి షూరిటీ కోరింది. బాండ్, షూరిటీ ఇస్తామని గాలి సన్నిహితులు తెలపడంతో.. కోర్టు బెయిల్ ఇచ్చింది. గురువారం సాయంత్రం జనార్దన్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది.