కోబ్ బ్రయంట్ ఎవరు? అతని మృతి పట్ల ఎందుకు ఇంత రియాక్షన్ ?

Basketball icon Kobe Bryant Killed in Helicopter Crash


కోబ్ బీన్ బ్రయంట్ అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌ బాల్ క్రీడాకారుడు. బ్రయంట్ తన 20 సంవత్సరాల కెరీర్‌ను నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (NBA)లో లాస్ ఏంజిల్స్ లేకర్స్‌తో కలిసి ఆడాడు. బాస్కెట్ బాల్ లో ఇతడికి ట్రాక్ రికార్డ్ చాలా ఉంది. ఐదు NBA ఛాంపియన్‌షిప్‌లను అందించారు. 2008 NBA మోస్ట్ వాల్యుబుల్‌ ప్లేయర్ గా నిలిచారు. దింతో బ్రయంట్ గొప్ప బాస్కెట్‌బాల్ క్రీడాకారులలో ఒకరిగా నిలిచిపోయారు. NBA చరిత్రలో 20 సీజన్లలో ఆడిన మొదటి క్రీడాకారుడు బ్రయంట్. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం కేవలం అమెరికన్లకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులను దుఖః సాగరంలో ముంచి వేసింది.

Basketball icon Kobe Bryant Killed in Helicopter Crash

 

అమెరికా, కాలిఫోర్నియాలోని కాలాబాసాస్ లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో రిటైర్డ్‌ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్‌ బ్రయంట్ మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. మొత్తం ఈ హెలికాఫ్ట‌ర్ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతులలో బ్రయంట్ కూతురు కూడా ఉన్నారు. అయితే కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకునే స‌రికి ఆలస్యం అయినట్లు అక్కడి అధికారులు తెలియచేశారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హెలికాఫ్టర్ ఓవర్ లోడ్ తో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని జాతీయ రవాణా భద్రతా బోర్డు భావిస్తుంది. ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఓ బృందాన్ని కాలిఫోర్నియాకు పంపింది. ఈ ఘటనపై లాస్ ఏంజిల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ "డారిల్ ఓస్బీ" మాట్లాడుతూ, క్రాష్ సైట్ యాక్సెస్ చేయడం కష్టమని, అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రాంతాన్ని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.