బీసీసీఐ కొత్త ఐడియా...

బీసీసీఐ కొత్త ఐడియా...

 

టీమిండియా ఆరోగ్యంగా ఉంచడానికి బీసీసీఐ కొత్త ఐడియా తో ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌లో ఉన్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ట్రైనర్స్ గమనిస్తూనే ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌లో, జట్టు ఆటగాళ్లకు ఫిట్‌నెస్ చార్ట్ కూడా ఇవ్వబడింది. అంతే కాదు, అథ్లెట్స్ మానిటరింగ్ సిస్టమ్ (AMS) ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ట్రైనర్ నిక్ వెబ్, ఫిజియో నితిన్ పటేల్ దగ్గరుండి గమనిస్తున్నారు.

రిపోర్ట్ ప్రకారం నిక్, నితిన్ ఆటగాళ్ల పురోగతిపై మరియు AMS యాప్ ద్వారా అభివృద్ధి అవసరమయ్యే ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్టు జట్టు నిర్వహణతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. "ఆటగాళ్ళు డేటాను యాప్‌లో వేసిన వెంటనే నిక్, నితిన్ దీనిని చూసి, ప్రతిరోజూ ఆటగాళ్ల పురోగతిని తనిఖీ చేస్తారు" అని రిపోర్ట్స్ తెలిపాయి. లాక్‌డౌన్‌ అంటే ఆటగాళ్ళు వారి ఫిట్నెస్ను పక్కన పెట్టి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం కాదని, మాజీ ఆటగాడు ఇటీవల చెప్పారు.

" ఈ ఆటగాళ్ళు చాలా ప్రొఫెషనల్. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో పేర్కొన్న ప్రకారం, ఆటగాళ్ళు ఒకసారి తమకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు, కానీ ఫిట్నెస్ మర్చి కాదు. AMS app ద్వారా, వారు ఎప్పుడు ఎన్ని కేలరీలు తినవచ్చో  తెలుసుకోవచ్చు." జట్టు నిర్వహణ వర్గాలు చెప్పారు.