కామారెడ్డిలో రోడ్డుపైకి వ‌చ్చిన ఎలుగుబంటి..

కామారెడ్డిలో రోడ్డుపైకి వ‌చ్చిన ఎలుగుబంటి..

 

లాక్ డౌన్ నేప‌థ్యంలో అడ‌విలో ఉండాల్సిన జంతువులు జ‌న సంచారంలో తిరుగుతూ అంద‌రిని టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో చిరుత‌పులి సంచారం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఎలుగ‌బంటి సైతం జ‌న‌సంచారంలోకి వ‌చ్చి తెగ హ‌ల్ చ‌ల్ చేసింది.
 
వివ‌రాల్లోకి వెళ్తే అట‌వీ ప్రాంతం నుంచి త‌ప్పించుకున్న ఎలుగుబంటి కామారెడ్డి జిల్లాలోని రామ‌రెడ్డి మండ‌లం క‌న్నాపూర్ తండా వైపు వ‌చ్చింది. అంతేగాక స్థానికుడైన బాల‌రాజు అనే వ్య‌క్తిపై దాడిచేసింది. దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌ల‌ను ఎలుగుబంటి టెన్ష‌న్ పెట్టింది. అయితే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు ఎలుగుబంటిని వెంబ‌డించారు.
 
దాంతో బ‌య‌ప‌డిన ఎలుగుబంటి ప‌క్క‌నే ఉన్న బాత్రూంలోకి దూరింది.దాంతో దానిని బ‌య‌ట‌కు రాకుండా బాత్రూంకు క‌ర్ర‌ల‌ను అడ్డుగా పెట్టారు. ఆ త‌రువాత అట‌వీశాక అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అయితే అధికారులు అక్క‌డికి చేరుకునే లోపే ఎలుగుబంటి బాత్రూం డోర్లు ధ్వంసం చేసుకుని నర్సింహులు అనే వ్యక్తిపై దాడి చేసింది.

దీంతో కోపంతో ఉగిపోయిన స్థానికులు  కర్రలు, రాళ్లతో ఎలుగుబంటిని వెంబ‌డిస్తూ దాడి చేశారు. ఈ దాడిలో ఎలుగుబంటి తీవ్ర గాయ‌ల‌పా‌లైంది. అట‌వీ అధికారులు ఆ ప్ర‌దేశాన్ని చేరుకుని ఎలుగుబంటిని పశువుల ఆస్పత్రికి తరలించారు. అలాగే అడవి జంతువు దాడిలో గాయపడిన స్థానికుల్ని ఆస్పత్రికి తరలించారు.