ప‌డ‌కే శ‌వ‌పేటిక‌గా మార‌బోతోంది.. క‌రోనానే కార‌ణం..

ప‌డ‌కే శ‌వ‌పేటిక‌గా మార‌బోతోంది.. క‌రోనానే కార‌ణం..

 

క‌రోనా పేషెంట్లు చ‌నిపోయాక వారిని ముట్టు‌కోవ‌డానికి, వారిని ఖ‌న‌నం చెయ్య‌డానికి భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది.. చ‌నిపోయిన వారి ద్వారా కూడా క‌రోనా వ్యాపించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎంత సొంత వారైనా చ‌నిపోయిన క‌రోనా పేషెంట్ అంటే భ‌యంతో చ‌చ్చిపోతున్నారు. క‌రోనా శ‌వాల‌ను ఊర్ల‌లోకి కూడా రానివ్వ‌డంలేదు.. ఊరు బ‌య‌ట‌నే ఖ‌న‌నం చేసేస్తున్నారు చాలా చోట్ల‌..

అయితే ఈ స‌మ‌స్యను అధిగ‌మించ‌డానికి వ్యాపారవేత్త రుడాల్ఫో గోమెజ్ ఒక గొప్ప ప‌ద్ధ‌తిని క‌నిపెట్ట‌బోతున్నారు. కొలంబియా ఓ వినూత్న విధానంపై ప్రయోగాలు చేస్తోంది. పడకనే శవపేటికగా మార్చే విధానాన్ని పరిశీలిస్తోంది. కరోనా కారణంగా మరణించిన బాధితులను వారికి చికిత్స అందించిన పడకలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించేలా పడకలను తయారు చేస్తోంది. 

గోమెజ్ మాట్లాడుతూ.. ఈక్వెడార్‌లో కరోనా బాధితుల మృతదేహాలకు అంత్యక్రియలు జరగక రోడ్లపై పడి ఉంటున్నాయన్నారు. అది చూసిన తాను చాలా బాధపడ్డానని, అందుకే శవ పేటికలుగా మారే పడకలను రూపొందిస్తున్నానని చెప్పారు. 

ఈ పడకల ఖరీదు దాదాపు 92 డాలర్లు(రూ.7వేలు) నుంచి 132 డాలర్లు(రూ.10వేలు) వరకు ఉంటుందని చెప్పారు. దీనికి ఇనుపకడ్డీలతో రెయిలింగ్ ఉంటుందని, చక్రాలు, బ్రేకులు కూడా ఉంటాయని, పైకి, కిందకు జరుపుకునేందుకు వీలుంటుందని వివరించారు.