రూ. 500లోపు బెస్ట్ వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే

రూ. 500లోపు బెస్ట్ వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే

ప్రముఖ టెలికం దిగ్గజం వోడాఫోన్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. మొబైల్ టారిఫ్ ధరలను పెంచినప్పటికీ వోడాఫోన్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్లతో పాటు ప్రస్తుత ప్లాన్ల ధరలను రివైజ్ చేస్తోంది. వోడాఫోన్ తమ కస్టమర్లందరికి సౌకర్యవంతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయాలని భావిస్తోంది. అందుకే రూ.500ల లోపు అన్ని బెనిఫిట్స్ ఉన్న ప్రీపెయిడ్ ప్లానను అందిస్తోంది. దాదాపు మొత్తం 10 ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో డేటాతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తోంది. ఇందులో తొలి ప్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసి రూ.249గా ఉంది. ఈ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు 28 రోజుల కాల పరిమితి ఉంటుంది. 

రోజుకు 1.5GB డేటాతో పాటు రూ.999ల విలువైన వోడాఫోన్ ప్లే, జీ5 సర్వీసు ఫ్రీ సబ్  స్ర్కిప్షన్ కూడా అందిస్తోంది. ఇది ప్రతి వోడా ఫోన్ యూజర్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా డేటా బెనిఫెట్స్‌తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ఇతర ఎకనామికల్ ప్లాన్లలో రూ.219, రూ.199 కూడా అందిస్తోంది. రూ.199 ప్లాన్ పై రోజుకు 1GB వరకు డేటా అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు అందిస్తోంది. కానీ, ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 21 రోజులు మాత్రమే. మరో రూ.219 ప్లాన్ లో కూడా అదే డేటా, కాల్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో మాత్రం వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఇస్తోంది. 

ఒకవేళ వోడాఫోన్ యూజర్ రూ.199లతో రీఛార్జ్ చేస్తే.. దీనికి అదనంగా కొంచెం అమౌంట్ ఎక్కువైనా వ్యాలిడిటీ పరంగా రూ.219 రీఛార్జ్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఏది ఏమైనా.. వ్యాలిడిటీ తక్కువ ఉన్న పర్వాలేదు.. రోజులో ఎక్కువ డేటా వస్తే చాలు అనుకునే యూజర్లకు మాత్రం రూ.398, రూ.299 ప్లాన్లు ఎంతో బెస్ట్. ఇక రూ. 398 ప్లాన్ పై రోజుకు 3GB డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ అన్ని నెట్ వర్క్ లకు చేసుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అదేవిధంగా రూ.299 ప్లాన్ రోజుకు  2GB డేటా అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో 28 రోజుల కాలపరిమితితో ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లలో వోడాఫోన్ ప్లే, జీ5 సర్వీసు సబ్ స్ర్కిప్షన్ ఉచితంగా అందిస్తోంది.