భలే భలే మగాడివోయ్ కాంబో మళ్లీ రాబోతోందా?

భలే భలే మగాడివోయ్ కాంబో మళ్లీ రాబోతోందా?

 

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.  తన 25 వ చిత్రం కావడంతో నానిని దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. 

ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా మరో పాత్రలో హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది.ఇదిలా ఉంటే నాని ఈ చిత్రం తరువాత టక్ జగదీష్ చిత్రాన్ని చేయబోతున్నాడు. శివ నిర్వాణ దీనికి దర్శకుడు. 

అయితే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా భలే భలే మగాడివోయ్. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నాని కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలవడంతో పాటు నాని మార్కెట్ స్థాయిని కూడా పెంచింది. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే  ప్రతిరోజూ పండగ విజయంతో మంచి ఊపు మీదున్న మారుతి నాని కోసం ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే మళ్లీ భలే భలే మగాడివోయ్ కాంబినేషన్ ప్రేక్షకులను కనువిందు చేయనుందని సమాచారం. అయితే ఈ క్రేజీ కాంబో వార్తకు సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.