భీష్మ ప్రీ రిలీజ్ కి ముఖ్యఅతిధి అతడే !!

 భీష్మ ప్రీ రిలీజ్ కి ముఖ్యఅతిధి అతడే  !!

లవర్ బాయ్ నితిన్, ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో పీక్స్ లో ఉన్న రష్మిక తో భీష్మ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 17 న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఐతే ఎవరు ముఖ్య అతిధి అని చాలా డిస్కషన్స్ జరిగాయట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి విపరీతమైన అభిమానం. పవన్ కి కూడా నితిన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే పవన్ మెగాఫ్యామిలీ హీరోల ఈవెంట్స్ కి వెళ్లినా వెళ్లకపోయినా నితిన్ ఫంక్షన్ కి మాత్రం హాజరయ్యేవాడు. 

కానీ ఈసారి నితిన్ ఎంత ప్రయత్నించినా పవన్ షూటింగ్స్ లో, పాలిటిక్స్ లో క్షణం తీరిక లేకపోవడం వల్ల తన స్నేహితుడు త్రివిక్రమ్ ని వెళ్లాల్సిందిగా కోరాడట. త్రివిక్రమ్ నితిన్ తో అ ఆ సినిమా తీసాడు. ఈ సినిమాను సితార‌ ఎంటర్‌టైన్మెంట్స్, హారిక హాసిని బ్యానర్స్‌ క‌లిసి నిర్మిస్తున్నాయి. హారిక హాసిని బ్యానర్ అంటే త్రివిక్రమ్ సొంత బ్యానర్, ఆ బ్యానర్లో త్రివిక్రమ్ భాగ‌స్వామి అని అందరికీ తెలిసిందే. కాబట్టి సొంత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నమాట. ఈ సినిమాని గతంలో నాగ శౌర్యతో ఛ‌లో తీసిన వెంకీ కుడుమల దర్శకుడు. మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.