ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదే

Biggest stadium is being built in Ahmedabad

గుజరాత్ : భారత్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకోబోతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంను 2020 మార్చి నెలలో ప్రారంభించబోతుంది. ఈ స్టేడియం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుగుతున్నాయి. 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1,10,000. ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే 10,000 ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. ఈ భారీ స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని నామకరణం చేశారు.