30 కోట్లు ఆఫర్ ఇస్తామంటున్న బి.జె.పి నాయకులు..!!

0
72
Lakshmi Hebbalkar

పార్టీ ఫిరాయించి కమలదళంలో చేరితే మంత్రి పదవితో పాటు రూ.30 కోట్ల నగదు కూడా ఇస్తామని భాజపా నాయకుల నుంచి ఆఫర్‌ వచ్చినట్లు కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.  బెళగావిలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. భాజపా నాయకులు తనకు చేసిన ఫోన్‌లోని సంభాషణల్ని రికార్డు చేసి పార్టీ నాయకులకు చూపినట్లు తెలిపారు. ‘ఆపరేషన్‌ కమలం’ గురించి నాయకులకు వివరించనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందన్నారు. లక్ష్మీ హెబ్బాళ్కర్‌ వ్యాఖ్యలు రాజకీయంగా శుక్రవారం దుమారం రేపాయి. రానున్న మంత్రర్గ విస్తరణ నేపథ్యమే ఆమె ఆరోపణలకు కారణం అని భావిస్తున్నారు.