అటు శత్రువుల గుంపు.. ఇటు బైరెడ్డి గుండె

అటు శత్రువుల గుంపు.. ఇటు బైరెడ్డి గుండె

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి చుట్టూ మళ్లీ శత్రువులు స్కెచ్ వేస్తున్నారా...? రోజు రోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ ప్రత్యర్థులకు పంటికింద రాయిలా మారిందా..? ఒక్క బైరెడ్డి ని ఢీ కొట్టేందుకు ప్రత్యర్థులంతా చేతులు కలిపారా...? బైరెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సరికొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నారా...? శత్రువుల గుంపుతో తలపండేందుకు బైరెడ్డి సిద్ధార్థ్ గుండె ధైర్యంతో సిద్ధమవుతున్నారా...? యస్. ఇప్పుడు నందికొట్కూర్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతింతై వటుడింతై అన్నట్టు రోజురోజుకీ ప్రజల్లో దూసుకెళుతున్న బైరెడ్డి సిద్ధార్థ్ ని వెన్నుపోటు రాజకీయాలతో వెనక్కు లాగేందుకు మళ్లీ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ విషయం సాక్షాత్తూ ఆయన అభిమానులే సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నారు. 

సొంత పార్టీ శత్రువులు, కుటుంబంలోని విభేదాలు, చిరకాల రాజకీయ ప్రత్యర్థులు అన్ని ఒక్కటై కాటేసేందుకు మాటువేశాయి. రాజకీయ వర్గపోరుకి దూరంగా, ప్రజా సమస్యల పరిష్కారినికి పనిచేస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని ఎలాగైనా రెచ్చగొట్టి రాజకీయ రచ్చ సృష్టించాలని పన్నాగం పన్నుతున్నారు. ఈ పన్నాగాలను పసిగట్టిన బైరెడ్డి సిద్ధార్థ్ ఈ సారి ఆవేశంతో కాదు... ఆలోచనతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి నుంచి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ని దూరం చేయాలని చాలా మంది నాయకులు ప్రయత్నించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా బైరెడ్డిపైనా, ఆయన వర్గంపైనా అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. సాక్షాత్తూ సొంత పార్టీ నేతలే టీడీపీ నేతలతో చేతులు కలిపి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. ఆ సమయంలో ఆవేశంతో రగిలిపోయిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ మోహ‌న్ రెడ్డి అండతో శత్రువుల ముందు తలెత్తుకుని నిలబడ్డారు. తలబడి కాదు...ప్రజల పక్షాన నిలబడి పోరాడతానని శపథం చేశారు. అంతే నందికొట్కూర్ లో స్థానిక ఎమ్మెల్యే బైరెడ్డిని విభేదించినా, విమర్శించినా పట్టించుకోలేదు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి శివానందరెడ్డి చీకటి దెబ్బలు కొట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు. బైరెడ్డి కుటుంబంలోని సొంత పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే టార్గెట్ చేసినా తొణకలేదు.

జగన్  ఎలాగైతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ముప్పేట దాడి చేసినా.... ముఖాన చెరగని చిరునవ్వుతో శత్రువులతో పోరాడి ప్రజావిజయం సాధించారో... అదే స్ఫూర్తితో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా రాజకీయ శత్రువులను తన వ్యూహాలతో జయిస్తున్నారు. ప్రజాబలం, నాయకుడి అండ రెండే ఆయుధాలతో శత్రువులతో పోరాడుతున్నారు. అయితే రోజురోజుకీ బైరెడ్డి బలం పెరగడంతో ఇప్పుడు శత్రువులంతా ఒక్కటైపోయారు. ఒకప్పటి బద్ద శత్రువులు కూడా ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ ని అణగదొక్కేందుకు కలిసిపోయారు. 

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కందుల శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి లతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని బైరెడ్డి వ్యతిరేక వర్గీయులు కూడా చేతులు కలిపారు. లాక్ డౌన్ లో బైరెడ్డికి ప్రజల్లో ఇమేజ్ శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడంతో డ్యామేజ్ చేసేందుకు అంతా ఒక్కటయ్యారు. మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆయన వర్గీయులపై తప్పుడు కేసులు పెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. తాజాగా నందికొట్కూర్ లో జరిగిన ఓ ఘటన ఈ కుట్రలను బయటపెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండవల్లి అనుషా అనే మహిళా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ పెట్టారు. ఆమె మొత్తం టీడీపీ నేతలకు షేర్ చేశారు. దానిని అక్కడ బీజేపి నేతలు కూడా ప్రచారం చేశారు. ఎందుకంటే అక్కడ బీజేపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తోంది. 

అలా బీజేపీ, టీడీపీ ఒక్కటై దుష్ప్రచారం చేశారు. దానికి బైరెడ్డి వ్యతిరేకవర్గంగా ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా తోడయ్యారు. అంతా కుమ్మక్కై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆయన వర్గీయులు రౌడీలు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు తోపీక్ ముస్లిం మహిళపై కర్రలతో దాడిచేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 

వాస్తవానికి తోఫిక్ తన అక్కను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. తోఫిక్ అక్కపై బీజేపీ వర్గీయులు దాడి చేస్తే, బైరెడ్డి సిద్ధార్థ్ అభిమాని తోఫిక్ ను కాపాడుకున్నారు. ఆ ఫొటోలను ఉల్టాగా ప్రచారం చేసి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కుట్రలను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహాత్మకంగా ఛేధించారు. అసలు నిజాలను, ఫొటోలను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఇలాంటి కుట్రలు చాలా చేస్తున్నారని బైరెడ్డి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 

అన్ని పార్టీల శత్రువులు ఒక్కటైపోయి ఒకే ఒక్క బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఎలాగైనా తప్పుడు కేసులు పెట్టించేందుకు, రౌడీ గా ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని అనుమానిస్తున్నారు. తన ప్రత్యర్థులు శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, వైసీపీలోని కొందరు నాయకులు ఒక్కటైపోయారని పసిగట్టిన బైరెడ్డి ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రత్యర్థులు ఎంతటివారైనా సరే గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. అంతమంది రాజకీయ ఉద్ధండులు ఒక్కటైనా ఉడుంపట్టులా నందికొట్కూర్ నియోజకవర్గంపై పట్టుసాధించారు. 

జగన్ దగ్గర బైరెడ్డిని చులకన చేయాలని చూస్తే అదే జగన్ ఆశీస్సులు పొంది తన పట్టు నిరూపించుకున్నారు. బుద్ధిబలం...ప్రజా బలం ఉంటే చాలు ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా ఓడిస్తానన్న నమ్మకంతో రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇంతమంది ఒక్కటైనా సరే బైరెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని దక్కించుకున్నారు. నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవిని దక్కించుకున్నారు. అంతేకాదు నందికొట్కూర్ లో స్థానిక ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు తన వర్గానికే సీట్లు సంపాదించుకున్నారు. 

బైరెడ్డి కి జగన్ బలం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు అవసరంలేదు. అందుకే ఇప్పుడు శత్రువులంతా ఒక్కటైనా బైరెడ్డి మాత్రం వాళ్ల ట్రాప్ లో పడకుండా పొలిటికల్ స్ట్రేటజీని మార్చారు. వాళ్లు రౌడీ ముద్ర వేద్దామనుకుంటే...బైరెడ్డి తన మార్క్ రాజకీయ ముద్ర వేస్తున్నారు. వాళ్లు బైరెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామనుకుంటే బైరెడ్డి వాళ్ల ఫేక్ స్ట్రేట‌జీని పెద్ద క్యాబేజీ అని నిరూపిస్తున్నారు. 

వాళ్లు ఇంట్లో నుండే కుట్రలు చేస్తుంటే...బైరెడ్డి జనంలోకి చొచ్చుకెళ్లి ఆ కుట్రలను ఛేదిస్తున్నారు. వాళ్లు బైరెడ్డిని అణగదొక్కాలని చూస్తుంటే...అది అంత ఈజీ కాదని బైరెడ్డి నిరూపిస్తున్నారు. తాజా పరిణామాలతో మళ్లీ వేడెక్కిన బైరెడ్డి సిద్ధార్థ్, ఆయన ప్రత్యర్థుల పొలిటికల్ వార్ ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి. అటు శత్రువుల గుంపు.. ఇటు బైరెడ్డి గుండె

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి చుట్టూ మళ్లీ శత్రులవులు స్కెచ్ వేస్తున్నారా...? రోజు రోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ ప్రత్యర్థులకు పంటికింద రాయిలా మారిందా..? ఒక్క బైరెడ్డి ని ఢీ కొట్టేందుకు ప్రత్యర్థులంతా చేతులు కలిపారా...? బైరెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సరికొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నారా...? శత్రువుల గుంపుతో తలపండేందుకు బైరెడ్డి సిద్ధార్థ్ గుండె ధైర్యంతో సిద్ధమవుతున్నారా...? యస్. ఇప్పుడు నందికొట్కూర్ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతింతై వటుడింతై అన్నట్టు రోజురోజుకీ ప్రజల్లో దూసుకెళుతున్న బైరెడ్డి సిద్ధార్థ్ ని వెన్నుపోటు రాజకీయాలతో వెనక్కు లాగేందుకు మళ్లీ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ఈ విషయం సాక్షాత్తూ ఆయన అభిమానులే సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నారు. 

సొంత పార్టీ శత్రువులు, కుటుంబంలోని విభేదాలు, చిరకాల రాజకీయ ప్రత్యర్థులు అన్ని ఒక్కటై కాటేసేందుకు మాటువేశాయి. రాజకీయ వర్గపోరుకి దూరంగా, ప్రజా సమస్యల పరిష్కారినికి పనిచేస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని ఎలాగైనా రెచ్చగొట్టి రాజకీయ రచ్చ సృష్టించాలని పన్నాగం పన్నుతున్నారు. ఈ పన్నాగాలను పసిగట్టిన బైరెడ్డి సిద్ధార్థ్ ఈ సారి ఆవేశంతో కాదు... ఆలోచనతో ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి నుంచి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ని దూరం చేయాలని చాలా మంది నాయకులు ప్రయత్నించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా బైరెడ్డిపైనా, ఆయన వర్గంపైనా అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. సాక్షాత్తూ సొంత పార్టీ నేతలే టీడీపీ నేతలతో చేతులు కలిపి రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. ఆ సమయంలో ఆవేశంతో రగిలిపోయిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ మోహ‌న్ రెడ్డి అండతో శత్రువుల ముందు తలెత్తుకుని నిలబడ్డారు. తలబడి కాదు...ప్రజల పక్షాన నిలబడి పోరాడతానని శపథం చేశారు. అంతే నందికొట్కూర్ లో స్థానిక ఎమ్మెల్యే బైరెడ్డిని విభేదించినా, విమర్శించినా పట్టించుకోలేదు. చిరకాల రాజకీయ ప్రత్యర్థి శివానందరెడ్డి చీకటి దెబ్బలు కొట్టే ప్రయత్నం చేసినా భయపడలేదు. బైరెడ్డి కుటుంబంలోని సొంత పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే టార్గెట్ చేసినా తొణకలేదు.

జగన్  ఎలాగైతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటై ముప్పేట దాడి చేసినా.... ముఖాన చెరగని చిరునవ్వుతో శత్రువులతో పోరాడి ప్రజావిజయం సాధించారో... అదే స్ఫూర్తితో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా రాజకీయ శత్రువులను తన వ్యూహాలతో జయిస్తున్నారు. ప్రజాబలం, నాయకుడి అండ రెండే ఆయుధాలతో శత్రువులతో పోరాడుతున్నారు. అయితే రోజురోజుకీ బైరెడ్డి బలం పెరగడంతో ఇప్పుడు శత్రువులంతా ఒక్కటైపోయారు. ఒకప్పటి బద్ద శత్రువులు కూడా ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ్ ని అణగదొక్కేందుకు కలిసిపోయారు. 

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కందుల శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి లతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని బైరెడ్డి వ్యతిరేక వర్గీయులు కూడా చేతులు కలిపారు. లాక్ డౌన్ లో బైరెడ్డికి ప్రజల్లో ఇమేజ్ శిఖరాగ్ర స్థాయికి చేరుకోవడంతో డ్యామేజ్ చేసేందుకు అంతా ఒక్కటయ్యారు. మళ్లీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆయన వర్గీయులపై తప్పుడు కేసులు పెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. తాజాగా నందికొట్కూర్ లో జరిగిన ఓ ఘటన ఈ కుట్రలను బయటపెట్టింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండవల్లి అనుషా అనే మహిళా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ పెట్టారు. ఆమె మొత్తం టీడీపీ నేతలకు షేర్ చేశారు. దానిని అక్కడ బీజేపి నేతలు కూడా ప్రచారం చేశారు. ఎందుకంటే అక్కడ బీజేపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తోంది. 

అలా బీజేపీ, టీడీపీ ఒక్కటై దుష్ప్రచారం చేశారు. దానికి బైరెడ్డి వ్యతిరేకవర్గంగా ఉన్న కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా తోడయ్యారు. అంతా కుమ్మక్కై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆయన వర్గీయులు రౌడీలు అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడు తోపీక్ ముస్లిం మహిళపై కర్రలతో దాడిచేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 

వాస్తవానికి తోఫిక్ తన అక్కను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. తోఫిక్ అక్కపై బీజేపీ వర్గీయులు దాడి చేస్తే, బైరెడ్డి సిద్ధార్థ్ అభిమాని తోఫిక్ ను కాపాడుకున్నారు. ఆ ఫొటోలను ఉల్టాగా ప్రచారం చేసి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కుట్రలను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహాత్మకంగా ఛేధించారు. అసలు నిజాలను, ఫొటోలను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఇలాంటి కుట్రలు చాలా చేస్తున్నారని బైరెడ్డి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. 

అన్ని పార్టీల శత్రువులు ఒక్కటైపోయి ఒకే ఒక్క బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఎలాగైనా తప్పుడు కేసులు పెట్టించేందుకు, రౌడీ గా ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని అనుమానిస్తున్నారు. తన ప్రత్యర్థులు శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, వైసీపీలోని కొందరు నాయకులు ఒక్కటైపోయారని పసిగట్టిన బైరెడ్డి ఆచితూచి అడుగులేస్తున్నారు. ప్రత్యర్థులు ఎంతటివారైనా సరే గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. అంతమంతి రాజకీయ ఉద్ధండులు ఒక్కటైనా ఉడుంపట్టులా నందికొట్కూర్ నియోజకవర్గంపై పట్టుసాధించారు. 

జగన్ దగ్గర బైరెడ్డిని చులకన చేయాలని చూస్తే అదే జగన్ ఆశీస్సులు పొంది తన పట్టు నిరూపించుకున్నారు. బుద్ధిబలం...ప్రజా బలం ఉంటే చాలు ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా ఓడిస్తానన్న నమ్మకంతో రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇంతమంది ఒక్కటైనా సరే బైరెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని దక్కించుకున్నారు. నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవిని దక్కించుకున్నారు. అంతేకాదు నందికొట్కూర్ లో స్థానిక ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు తన వర్గానికే సీట్లు సంపాదించుకున్నారు. 

బైరెడ్డి కి జగన్ బలం ఉందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు అవసరంలేదు. అందుకే ఇప్పుడు శత్రువులంతా ఒక్కటైనా బైరెడ్డి మాత్రం వాళ్ల ట్రాప్ లో పడకుండా పొలిటికల్ స్ట్రేటజీని మార్చారు. వాళ్లు రౌడీ ముద్ర వేద్దామనుకుంటే...బైరెడ్డి తన మార్క్ రాజకీయ ముద్ర వేస్తున్నారు. వాళ్లు బైరెడ్డి ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామనుకుంటే బైరెడ్డి వాళ్ల ఫేక్ స్ట్రేట‌జీని పెద్ద క్యాబేజీ అని నిరూపిస్తున్నారు. 

వాళ్లు ఇంట్లో నుండే కుట్రలు చేస్తుంటే...బైరెడ్డి జనంలోకి చొచ్చుకెళ్లి ఆ కుట్రలను ఛేదిస్తున్నారు. వాళ్లు బైరెడ్డిని అణగదొక్కాలని చూస్తుంటే...అది అంత ఈజీ కాదని బైరెడ్డి నిరూపిస్తున్నారు. తాజా పరిణామాలతో మళ్లీ వేడెక్కిన బైరెడ్డి సిద్ధార్థ్, ఆయన ప్రత్యర్థుల పొలిటికల్ వార్ ఏ టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.