విదేశీ ఆటగాళ్ళకు షాకిచ్చిన కేంద్రం...

విదేశీ ఆటగాళ్ళకు షాకిచ్చిన కేంద్రం...

 

కరోనా వైరస్ ప్రభావంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.  మరొకొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ళు ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రం ఏప్రిల్ 15 వరకూ విదేశీ ఆటగాళ్ళకు వీసాలు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఫ్రాంచైజీ ఓనర్లతో పాటు అభిమానులు సైతం నిరాశ చెందారు.. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దౌత్య పరమైన వీసాలకు మాత్రం కేంద్రం అనుమతినిచ్చింది. ఒక వేళ విదేశీ ఆటగాళ్ళను ఆడించాలంటే వారికి దౌత్య పరమైన వీసాలు తీసుకోవాలి...

ఈ విషయంపై బీసీసీఐ మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఈ నెల 14 ముంబైలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 63 కి చేరింది. దీంతో కరోనా వైరస్ ప్రభావం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరగవచ్చనే భయాందోళనలు ప్రతి ఒక్కరిలో నెలకొన్నాయి. ఒక వేళ ఐపీఎల్ నిర్వహించినా స్టేడియంలోకి అభిమానులను అనుమతించే సూచనలు కూడ తక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్  ఐటీ, సినిమాతో పాటు పలు రంగాలపై తన ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు క్రికెట్ పై కూడా తన ప్రభావాన్ని చూపించడంతో ఐపీఎల్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.