గెలుపు టీడీపీదే కావాలి, గెలిచే అభ్యర్థులకే సీట్లు : చంద్రబాబు

0
233
ap cm teleconference

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపు టీడీపీదే కావాలని, గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తామని తేల్చిచెప్పారు. బుధవారం పార్టీ నాయకులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 31 నుంచి గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు చుట్టుముట్టినా పట్టుదలగా అధిగమించామన్నారు. తిత్లీ తుఫాన్‌తో తీవ్ర నష్టం వాటిల్లిందని అయినప్పటికీ 11 రోజుల్లో సాధారణ పరిస్థితులు తెచ్చామని తెలిపారు. ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ఉందని పార్టీ నాయకులతో చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఐటీ దాడులతో భయోత్పాతం సృష్టించారన్నారు. లౌకికవాదం ప్రమాదంలో పడిందని, బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. బీజేపీ పద్ధతిలేని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో టీడీపీ క్రియాశీలం కావాలని చంద్రబాబు తెలిపారు.