తన మార్క్ రాజకీయాన్ని నడుపుతున్న చంద్రబాబు; ఇబ్బన్దుల్లొ TDP నేతలు, కార్యకర్తలు

0
166

జగన్ హవాను ఎదుర్కునే విషయంలో ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే అభ్యర్ధుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా, వారితోనే ఎదుటి వారి పేర్లను చెప్పిస్తున్నారు. మొదటగా ఖరారైన సీట్లు ఇవేనంటూ మీడియాకు, పార్టీ నేతలకు లీకులు ఇస్తున్న చంద్రబాబు… ఆ తర్వాత కొత్త వారి పేర్లను తెర మీదకు తెస్తున్నారట. ఆ తర్వాత సమీక్షలు, ఒడపోతల పేరుతో నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ పెంచుతున్నారట.

నెల రోజుల కింద ఖరారైనట్లుగా చెబుతున్న సీట్ల విషయంలో కూడా చంద్రబాబు ఇదే తరహా రాజకీయం నడుపుతున్నార‌నేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా చంద్రబాబు కీలకంగా భావిస్తున్న 40 నియోజకవర్గాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆఫీసులో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొదటగా ఆశావాహులను పిలవడం, ఆ తర్వాత, ఇతనే అభ్యర్థి అంటూ తన సొంత మీడియా ద్వారా లీకులు ఇవ్వడం… ఇందుకోసం ఓ వ్యవస్థను కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఫలానా వ్యక్తికి టిక్కెట్ ఖాయం అన్న మాట మాత్రం వినిపించడం లేదు. వచ్చే వార్తలన్నీ ఖరారు అయ్యాయన్నవి మాత్రమే. అంటే వార్త చివర్లో మనకి మనమే క్వచన్ మార్క్ జోడించాలి.

ఈ రకంగా తన మార్క్ రాజకీయాన్ని నడుపుతున్న చంద్రబాబు… చాలా మంది ఆశావాహుల్లో బీపీ పెంచేస్తున్నారు. తాజాగా చిత్తూరు ఎంఎల్ఏ సత్యప్రభ విషయంలో కూడా ఇదే జరిగిందట. సిట్టింగులకు టిక్కెట్ ఖాయమన్న మొదటి వార్తతో సంబరపడ్డ ఆమె… ఆ తర్వాత సమీక్షల పేరుతో ఆశావాహులను పిలవడంతో కంగారు పడ్డారట. దీంతో తనకు టిక్కెట్ వస్తుందా, రాదా అన్న టెన్షన్ ఎక్కువై సత్యప్రభ అస్వస్థతతకు గురయ్యారట. ఇంతకీ చంద్రబాబు ఇంత హడావుడిగా తన మార్క్ రాజకీయం ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న కూడా తెలుగు తమ్ముళ్లను వేధిస్తోంది. దీనికి టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది ఒక్కటే. తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ముందు… ఏపీలో సిట్టింగులకు సీట్లు ఖాయమని చెప్పిన ఏపీ సీఎం… తెలంగాణ ఫలితాల్లో సీన్ రివర్స్ అవ్వగానే… ఏపీలోని టీడీపీ సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలా, వద్దా అన్న ఆలోచనలో చంద్రబాబు పడినట్లు తెలుస్తోంది.ఇదంతా తెల్సిన తర్వాత తెలంగాణ, ఏపీ రాజకీయాల మధ్య పొంతన ఏంటో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. మొత్తానికి చంద్రబాబు మార్క్ రాజ‌కీయం ఎలా ఉంటుందో ఇప్పుడు చాలా మందికీ బోధ పడుతోంది.