తిరుమలలో చిరుతలు హల్ చల్

తిరుమలలో చిరుతలు హల్ చల్

 

ఒకవైపు తిరుమల కొండలన్నీ జనాలు లేక వెలవెలబోతుంటే.. మరోవైపు అడవిలో నుంచి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. భక్తులు వెళ్లే నడక దారిలో, రోడ్డు మార్గంలో జింకలు, చిరుతలు కనిపించాయి. ఓ జింకల గుంపు తిరుమల రోడ్డు మార్గంలో హల్ చల్ చేసింది. రోడ్డుపై అటు ఇటూ ఆ గుంపు సందడి చేసింది.

 
మరోవైపు ఇటు భక్తులు వెళ్లే నడక దారిలో చిరుత కూడా కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై ఉన్న ఓ వ్యక్తి చిరుతను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. తిరుమలలో భక్తులు లేకపోవడంతో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.

జనసంచారం లేకపోవడంతో అటవీ ప్రాంతంలోని జంతువులు తిరుమలలో ప్రవేశిస్తున్నాయి. కల్యాణ వేదిక, ముల్లగుంట, ఎస్వి మ్యూజియం, ఎస్వి గెస్ట్ హౌస్, మొకాళ్ళ పర్వతం సమీపంలో చిరుతలు సంచారం చేస్తున్నాయి. ఘాట్ రోడ్డు వద్ద మరమ్మత్తులు చేస్తున్న కూలీలకు ఇవి కంటబడ్డాయి.


భయాందోళన చెందిన కూలీలు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.  రాత్రి‌ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఘట్ రోడ్డులో వాహనలను టీటీడీ అనుమతించడం లేదు. దీంతో ప్రజలకు ఎటువంటి అపాయం కలిగే సూచనలు లేవని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.