హల్‌చల్‌ చేసిన చింతమనేని అనుచరులు

0
166
chintamaneni prabhakar

విజయవాడలో గురువారం అర్థరాత్రి విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు  దాడి చేశారు. ట్రాఫిక్‌ సిగ‍్నల్స్‌ను క్రాస్‌ చేసినందుకు వారిని కానిస్టేబుల్‌ ఆపేయత్నం చేశారు. దాంతో కారులోంచి దిగిన చింతమనేని అనుచరులు కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి దిగారు. ‘మా కారునే ఆపుతావా’ అంటూ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు.

కారును  పోలీస్ స్టేషన్ కు  తీసుకు  వెళ్లాలని కానిస్టేబుల్ అనడంతో వారు మరింత రెచ్చిపోయారు.  ఈ క్రమంలోనే ఆగ్రహంతో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై గవర్నర్‌పేట్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన చింతమనేని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.