RRR పై క్లారిటీ వచ్చేసింది

RRR  పై క్లారిటీ వచ్చేసింది

 

RRR అంటే ఇంతవరకూ రఘుపతి రాఘవ రాజారామ్, అని రామ రావణ రాజ్యం అని రకరకాల రూమర్స్ వినిపించేవి. కానీ ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ అసలు టైటిల్ రివీల్ చేశాడు జక్కన్న.  RRR అంటే రౌద్రం రణం రుధిరం అని మోషన్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసాడు.

 కరోనా వైరస్ వల్ల 21 రోజులు ప్రజలంతా ఇళ్ళలోనుంచి బయటకు రాలేని పరిస్థితి. దీంతో  తెలుగు వారికి నూతన సంవత్సరం కానుకగా రాజమౌళి ఈ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఇక ఈ మోషన్ పోస్టర్ విషయానికి వస్తే నిప్పు నీరు కాన్సెప్ట్ ని తీసుకుని ఇంట్రెస్టింగ్గా క్రియేట్  చేసినట్టు తెలుస్తోంది.

 నిప్పుని రౌద్రంగా చూపిస్తూ రామ్ చరణ్, నీరుని రుధిరంగా చూపిస్తూ ఎన్టీఆర్ ఇలా రెండు R లపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.  నిప్పు, నీరు లాంటి భిన్న స్వభావాలున్న పాత్రలుగా వీరిని చూపించారు. నిప్పులు చెందుతూ ఉండే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, నీరు తో చూపించే కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లను ఈ సినిమాలో దర్శకధీరుడు చూపించబోతున్నాడు.  

మూడో R రణం వెనుక ఉన్న అసలు మర్మం ఏంటో క్యూరియాసిటీ కలిగేలా ప్రేక్షకులకి ఫజిల్ లా వదిలాడు. ఇక ఈ మోషన్ పోస్టర్ కి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన ఎమ్.ఎమ్ కీరవాణి తన బాహుబలి నుంచి ఇంకా బయటకి వచ్చినట్టు లేరు. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఆ ఛాయలు ఎక్కువగా వినిపించాయి.  ఓవరాల్ గా RRR ఖచ్చితంగా ట్రెండింగ్ అయ్యేలా ఉంది. ఇక ట్రిపుల్ ఆర్ ఏ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.