తెలంగాణ టీడీపీలో అసంతృప్తులు…రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు

0
59
Chandrababu meets telangana tdp Leaders

తెలంగాణ లోని టీడీపీలో అసంతృప్తులను బుజ్జగించేందుకు స్వయంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు. అందరిని అమరావతికి పిలిపించి వారితో మాట్లాడాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అందరు అమరావతికి రావాల్సిందిగా వెల్లడించారు. దీంతో అరవింద్‌కుమార్‌గౌడ్‌, శోభారాణి సహా పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు. వారితో చంద్రబాబు చర్చించనున్నారు. అభ్యర్థులకు సహకరించి, పార్టీ విజయానికి కృషి చేయాలని, మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికి న్యాయం చేస్తామని అసంతృప్తులకు చంద్రబాబు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.తమకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను అని హామీ ఇచ్చారు అని పార్టీ వర్గీయుల వెల్లడించారు.