ఒక్కటైన మోదీ, జగన్.. చంద్రబాబుపై సీబీఐ

ఒక్కటైన మోదీ, జగన్.. చంద్రబాబుపై సీబీఐ

టీడీపీ అధినేత చంద్రబాబుకి ఊహించని దెబ్బ కొట్టారు సీఎం జగన్.  ప్రధాని మోదీ, జగన్ ఒక్కటైపోయి చంద్రబాబుకి చుక్కలు చూపించే పెద్ద ప్లాన్ వేశారు. రాజధాని భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఐడి, సిట్ విచారణలు వేసిన సీఎం జగన్ ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. మొత్తం చంద్రబాబు చిట్టాను ప్రధాని మోదీకి వివరించిన జగన్ ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ లు కలిసినప్పుడు డాట్ న్యూస్ ఏం చెప్పిందో ఇప్పుడు అక్షరాలా అదే జరిగింది. చంద్రబాబు అవినీతిపై కేంద్రం విచారణకు ఓకే చెప్పిన విషయాన్ని ముందు ప్రపంచానికి చాటిచెప్పింది డాట్ న్యూస్. ఇప్పుడు ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.


రాజధానిలో అక్రమాలపై సీఎం జగన్ అధికారంలోకి రాగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేశారు. ఉపసంఘం నివేదికను సీఎం జగన్ కు అందించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు పై నిగ్గుతేల్చారు.  బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల ను మార్చేసి, లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల చేసినట్టు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు చేయడం, తెల్ల రేషన్ కార్డు దారులను బినామీలుగా వాడి టీడీపీ నేతలు దోచేయడం జరిగాయని ప్రభుత్వం నిగ్గుతేల్చింది.


 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు, 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేసినట్టు గుర్తించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో టీడీపీ నేతలు, ప్రముఖులు ఉన్నారని మంత్రివర్గ ఉప సంఘం నివేదించింది. నారా చంద్రబాబు నాయుడు, వేమూరు రవికుమార్ ప్రసాద్,పరిటాల సునీత, జీవి ఎస్ ఆంజనేయులు,లింగమనేని రమేష్, . పయ్యావుల కేశవ్,లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు,పుట్టా మహేష్ యాదవ్ లు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్టు పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారంగానే సీబీఐ విచారణ జరగనుంది. మంత్రివర్గ ఉప సంఘం తరువాత సిఐడి విచారణ కు ఆదేశించి మాజీ మంత్రులు నారాయణ, పుల్లారావులపై కేసులు నమోదు చేశారు. తరువాత ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి మొత్తం రాజధాని అక్రమాలను విచారించారు. ఇప్పుడు ఈ కేసును ప్రధాని మోదీ ఆదేశంతో సీఎం జగన్ ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబుకి టెన్షన్ మొదలైంది. డాట్ న్యూస్ 40 రోజుల కిందట ఏం చెప్పిందో ఇప్పుడు మోదీ అదే చేశారు.