అనాల్సినవ‌న్నీ అనేసి...

అనాల్సినవ‌న్నీ అనేసి...

 

ఎప్పుడూ పొలిటీషియ‌న్స్ మ‌ధ్య‌నే ఎక్కువ‌గా విభేదాలు, విమ‌ర్శలు జ‌రుగుతుంటాయి. కానీ హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య జ‌రిగే మాట‌ల యుద్దాలు చాలా అరుదుగా క‌నినిపిస్తుంటాయి. అదే ఇప్పుడు టాలీవుడ్ లో జ‌రిగిన‌ట్టు అనిపించింది. అస‌లు విష‌యం ఏంటంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పూజాహోగ్డే నుంచి కొద్ది సేప‌టి క్రితం ఇన్ స్టాగ్రమ్ లో ఒక పోస్ట్ వ‌చ్చింది. ఈ పోస్ట్ లో హీరోయిన్ స‌మంత‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ పూజా ప‌లు వ్యాఖ్య‌లు చేసింది.

అయితే కొద్ది సేప‌టికే  పూజా ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. త‌న అకౌంట్ హ్యాక్ అయింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న టెక్నిక‌ల్ టీమ్ దీనిని తిరిగి పున‌రుద్ద‌రించ‌డానికి ప్ర‌య‌త్నించింద‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని కూడా ఆమె తిరిగి ఇన్ స్టాగ్ర‌మ్ లో పోస్ట్ చేసింది. ఎవ‌రూ కూడా త‌న అకౌంట్ నుంచి వ‌చ్చిన ఇన్విటేష‌న్ల‌ను స్వీక‌రించ‌వ‌ద్ద‌ని కూడా తెలిపింది.

అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిందంతా జ‌రిగిపోయింది. పూజా కావాల‌నే స‌మంత‌పై వ్యాఖ్య‌లు చేసింద‌ని, మ‌ళ్ళీ ఆ త‌ప్పును క‌ప్పి పుచ్చుకునేందుకే త‌న అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు చెబుతోందంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు దిద్దుబాటు చర్యలా అంటూ నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. ఈ విష‌యం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి..‌