సమగ్ర కరోనా సర్వే

సమగ్ర కరోనా సర్వే

 

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని ఆయన అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఈ సర్వేను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నంత వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. సర్వే పూర్తి కాగానే మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. 

అన్ని రాష్ట్రాల సరిహద్దులను అధికారులు మూసివేశారు. కర్ఫ్యూ వల్ల  ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది...