కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి శంకర్‌రావు రాజీనామా..!!

0
175
Congress Minister Shankar Rao

కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి శంకర్‌రావు ఆదివారం రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున షాద్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తునట్లు ప్రకటించారు. తార్నాకలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో సామాజిక న్యాయం లోపించిందని ఆరోపించారు.తనకు ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా పార్టీలోని అవినీతి పరులు కలిసి  అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రకులాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీలో సీట్లు అమ్ముకున్నారని విమర్శించారు.సమాజ్‌వాదీ పార్టీ తరఫున షాద్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి చూపిస్తాను అని సవాల్ చేశారు.