క‌రోనా కు కొత్త పేరును పెట్టిన డబ్ల్యూహెచ్‌వో

 క‌రోనా కు కొత్త పేరును పెట్టిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ప్రజలందరిని భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. చైనాలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి వ్యాధి అక్కడ వేలాది మందిని బలిగొని మిగతా దేశాలకు వ్యాప్తి చెందుతుంది. అలాంటి ఈ వైరస్ వ‌ల్ల‌ ఇటీవల  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ అత్యవసర పరిస్థితిని విధించిన సంగతి తెలిసిందే.  తాజాగా ఈ వైరస్ కు సంబంధించి మరో కీలక  నిర్ణయాన్నిడబ్ల్యూహెచ్‌వో  తీసుకుంది.
 ఈ నిర్ణయం ప్రకారం ఇక కరోనా వైరస్ పేరును కోవిడ్‌-2019 (covid-2019) గా పేరు మార్చినట్లు  డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కరోనా అనే పేరు కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుంది. దీంతో ఈ పేరుపై గందరగోళాన్ని తొలగించేందుకు పరిశోధకులు ఈ అధికారిక పేరును పెట్టినట్లు సమాచారం. ఈ  పేరు ఒక భూభాగాన్ని గానీ, ఒక జంతువును గానీ, ఒక స్వతంత్ర జాతిని గానీ సూచించదని.. ఈ పేరు ఆ వ్యాధిని మాత్రమే తెలియజేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)  వెల్ల‌డించింది. అయితే  క‌రోనా పేరును కోవిడ్‌-2019 గా పేరు మార్చుకున్న ఈ వ్యాధికి విరుగుడు క‌నుగోనాల్సి ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధులు  తెలిపారు  .