భారత్‌లో కరోనా వ్యాప్తితో దేశీయ మొదటి AI శిఖరాగ్ర సదస్సు వాయిదా

భారత్‌లో కరోనా వ్యాప్తితో దేశీయ మొదటి AI శిఖరాగ్ర సదస్సు వాయిదా

 

భారతదేశంలో కొత్త కరోనావైరస్ (COVID-19) రోజురోజుకీ విజృంభిస్తోంది. దేశ రాజధానిలో అక్టోబర్ నెలలో జరగాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మొదటి శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

 'RAISE 2020’ (Responsible AI for Social Empowerment 2020) అనే శీర్షికతో, గ్లోబల్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ సమావేశంగా అక్టోబర్ 5-6 తేదీలలో ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, స్మార్ట్ మొబిలిటీ, ఇతర రంగాలలో AI టెక్నాలజీని ఎలా వినియోగించాలి అనేదానిపై ఈ సమ్మిట్ జరగాల్సి ఉంది. 

ఈ సమావేశంలో పాల్గొనే వారందరికీ రిజిస్ట్రేషన్లు ఓపెన్ అయి ఉంటాయి. ఈ ప్రక్రియ మునుపటిలాగే ఉంటుంది. స్టార్టప్ పిచ్ ఫెస్ట్ కోసం అన్ని AI స్టార్టప్‌లు ఒకే విధానం ద్వారా పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాయి" అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NGD) అధ్యక్షుడు, CEO అభిషేక్ సింగ్ అన్నారు. ప్రస్తుత COVID-19 వ్యాప్తిని తగ్గించడం కోసం పబ్లిక్ హెల్త్ దృష్ట్యా శిఖరాగ్ర సదస్సు వాయిదా వేసినట్టు ఆయన చెప్పారు. 

సాంఘిక పరివర్తన, సాధికారతను వేగవంతం చేయడంలో AI ఉపయోగం కోసం స్టార్టప్‌లు తమ ఆలోచనలను ప్రదర్శించడానికి 'Startup Pitchfest' ఒక వేదికగా పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రముఖ AI ల్యాబరేటరీగా భారతదేశానికి అవకాశం ఉన్నందున డేటా-రిచ్ వాతావరణాన్ని సృష్టించడం ఈ శిఖరాగ్ర లక్ష్యమని చెప్పారు. .