కరోనాతో బాధపడుతున్న తండ్రిని ఓదార్చిన కూతురు...

కరోనాతో బాధపడుతున్న తండ్రిని ఓదార్చిన కూతురు...

 

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అంశం కరోనా. ఈ వైరస్ బారిన పడి ఎన్నో దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాటిలో ఇజ్రాయెల్ ఒకటి. అక్కడి టెల్ అవీవ్‌లో ఓ అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతున్న తండ్రికి ఓ కూతురిచ్చిన ఓదార్పు అక్క‌డున్న‌వారంద‌రినీ కన్నీళ్లు పెట్టించింది.

ఒపెరా గాయని ఇరిట్ స్టార్క్ తండ్రి మైఖేల్ స్టార్క్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఆయన అపార్టుమెంటు బాల్కనీలో ఉంటే.. ఇరిట్ ఆయనకు వినిపించేలా బయట నుంచి పాట పాడుతూ తండ్రికి ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించారు. 

ఆమె ప్రయత్నం ఫలించింది. కూతురి పాట విన్న మైఖేల్ తన బాధనంతా మరచిపోయి చిరునవ్వు చిందిస్తూ చప్పట్లు కొట్టడం విశేషం. ఈ సంఘటనను చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇరిట్‌ని అభినందించారు.

క‌రోనావైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం దుఖంలో మునిగిపోయింది. ఎవ‌రిని క‌దిలించినా క‌రోనా వైర‌స్ గురించే మాట్లాడుతున్నారు. ప్ర‌తి వార్తా వైర‌స్ గురించే...  క‌రోనా ఈ ప్ర‌పంచాన్ని ఎప్పుడు వ‌దిలిపోతుందోన‌ని ప్ర‌తి ఒక్క‌రూ చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.