పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం

 

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుమారు 90 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరాచీ ఎయిర్ పోర్టుకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే విమానం కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ తో జనజీవనం స్థంభించిపోతుండగా తాజాగా ఈ విమాన ప్రమాదం పాకిస్థాన్ కు మరో కష్టాన్ని తెచ్చిపెట్టింది.