విద్యార్థుల మధ్య ఘర్షణ…ఒకరు మృతి

0
105
jagtial degree students fight

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని తాటిపల్లికి చెందన నవీన్, శ్రవణ్ ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. ఇందులో నవీన్‌ను శ్రవణ్‌ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ వెంకటరమణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.