దాదా@ ది నెక్ట్స్ ప్రెసిడెంట్ ఆప్ ఐసీసీ

దాదా@ ది నెక్ట్స్ ప్రెసిడెంట్ ఆప్ ఐసీసీ

 

అవును. ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మారుమోగుతోంది. దాదా ఏంటి ఐసీసీ ప్రెసిడెంట్ ఏంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే ఈ వార్త నిజం కాబోతున్నట్లే సంకేతాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు పాతాళంలో ఉన్న ఇండియన్ క్రికెట్ టీంకు విన్నింగ్ రుచి చూపించి, విదేశాల్లో భారత క్రికెట్ టీం సత్తా ఏంటో చూపించాడు సౌరవ్ గంగూలీ. 

ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. అయితే దాదా ఐసీసీ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందని చాలా మంది సీనియర్ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకీ ఈ వాదనలకు బలం చేకూరుతోంది.

తాజాగా సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఐసీసీ ప్రెసిడెంట్ గా గంగూలీ లాంటి వారుంటే చాలా మంచిదని, అతను అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాడని చెప్పాడు. గంగూలీ వల్ల క్రికెట్ కు చాలా లబ్ది చేకూరుతుందన్నాడు. అతని నాయకత్వ లక్షణాలు, టాలెంట్ ఛైర్మన్ గా విజయవంతం అయ్యేందుకు దోహదపడతాయని స్మిత్ చెప్పాడు. అతనితో పాటు జాక్వెల్ పాల్ కూడా గంగూలీకి మద్దతు ఇచ్చాడు. దీంతో గంగూలీకి మరింత బలం చేకూరింది..

ఐసీసీ ప్రెసిడెంట్ గా శశాంక్ మనోహర్ మరో రెండు నెలల పాటు ఉండనున్నారు. అయితే ఆ పదవికి ఇప్పటికే చాలా మంది దిగ్గజాలు పోటీపడుతుండగా అనూహ్యంగా గంగూలీ పేరు రేసులోకి వచ్చింది. దీంతో గంగూలీ లాంటి వారు ఐసీసీ ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.