లాక్ డౌన్ తో జనాలు పిచ్చోళ్ల‌వుతున్నారు: సాక్షి

లాక్ డౌన్ తో జనాలు పిచ్చోళ్ల‌వుతున్నారు: సాక్షి

 

ఇండియ‌న్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పై గ‌త కొంత కాలంగా ఎన్నో రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడ‌ని సోష‌ల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఎందుకంటే వ‌రల్డ్ కప్ కు ముందు ఇదే ధోనీ చివ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్ అని, ఐపీఎల్ కు ముందు ఇదే ధోనీ చివ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్ అనే ఎన్నో పుకార్లు వ‌చ్చాయి. 

అయితే ఈ ఏడాది ఐపీఎల్ ర‌ద్ద‌వ‌డంతో ఇక ధోనీ కెరీర్ ముగిసిన‌ట్టే అని అంద‌రూ అనుకుంటున్నారు. అందుకే సోష‌ల్ మీడియాలో ధోనీ రిటైర్ అయిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.. అయితే ఈ వార్తల‌ను ధోనీ భార్య సాక్షి తీవ్రంగా ఖండించారు. అలాంటి వార్త‌ల‌న్నీ  వొట్టి పుకార్లే న‌ని ఆమె క్లారిటీ ఇచ్చారు. 

అయితే దీంతో ఆగ‌కుండా ఓ అడుగు ముందుకేసి లాక్ డౌన్ వ‌ల్ల జ‌నాలు పిచ్చోళ్ళ‌వుతున్నార‌ని ట్వీట్ చేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద దుమార‌మే లేచింది. దీంతో ఆమె ఆ ట్వీట్ ని తొల‌గించారు. అయితే అప్ప‌టికే ఆ ట్వీట్ బాగా వైర‌ల్ అయింది. ఆమె దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకునే స‌మ‌యం కూడా లేకుండా పోయింది.