కరోనా వైరస్‌ని చైనా సృష్టించిందా?... మందును ముందే తయారుచేసుకుందా?

కరోనా వైరస్‌ని చైనా సృష్టించిందా?... మందును ముందే తయారుచేసుకుందా?

 

కరోనా వైరస్ అనేది చైనా స్వయంగా సృష్టించిన వైరస్ అని విదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు బలమైన కారణం ఉందంటున్నాయి. కొన్నేళ్లుగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న చైనా... తమ దేశంలో విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడిదారుల్ని ఎలా పంపించేయాలో తెలియక... ఈ వైరస్‌ని సృష్టించిందని ఆరోపిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో చాలా మంది విశ్లేషకులు ఈ వాదనను సమర్థిస్తున్నారు. చైనా ఆల్రెడీ కరోనా వైరస్ విరుగుడుకు మందును కూడా ముందే తయారుచేసుకుందని అంటున్నారు. తాజా పరిణామాల్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు.

జనవరి వరకూ చైనాలో కరోనా వైరస్ విపరీతంగా విస్తరించింది. అప్పుడు ఉష్ణోగ్రత 3 డిగ్రీలు ఉంటే... ఇప్పుడు 6 డిగ్రీలు ఉంది. అప్పుడు కరోనా కేసులు పెరిగినప్పుడు... ఇప్పుడెందుకు కొత్త కేసులు నమోదు కావట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. చైనాలో కొత్తగా ఎవరూ మరణించకపోవడానికి కూడా కారణం చైనా మందును ముందుగా తయారుచేయడమే అంటున్నారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తోందని విమర్శిస్తున్నారు.

చైనాలో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన చాలా విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థానిక కంపెనీల్లో వాటాలు కొనేసి... లాభాలు సంపాదిస్తూ, స్థానిక పారిశ్రామిక వేత్తలకు సమస్యగా మారుతున్నాయి. ప్రపంచీకరణ కారణంగా... చైనా తమ దేశంలో విదేశీ పెట్టుబడిదారుల్ని బలవంతంగా పంపలేదు. ఇలాంటి వైరస్‌ని సృష్టిస్తే... ఆటోమేటిక్‌గా ఆయా పెట్టుబడిదారులు తమ వాటాల్ని వెనక్కి తీసుకుంటారనే ఉద్దేశంతోనే చైనా ఈ కుట్ర పన్నిందనే వాదనపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తన ప్లాన్‌లో భాగంగా చైనా వుహాన్ నగరాన్ని ఎంచుకుందని. అక్కడైతే... అన్ని దేశాల ప్రజలూ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు కుంటున్నారు కాబట్టి... అక్కడ వైరస్‌ని వ్యాపింపజేస్తే... తమ వ్యూహం ఫలిస్తుందని చైనా ఈ స్కెచ్ వేసిందనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి.

ఆరోపణలకు తగ్గట్టే... చైనాలోని స్థానిక కంపెనీల్లో తమ వాటాల్ని విదేశీ పెట్టుబడిదారులు అమ్ముకున్నారు. చైనా నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా రెండు రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థలో రూ.1.50లక్షల కోట్ల స్వదేశీ సంపద వచ్చింది. ఐతే.. చైనా మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. అసలు వైరస్‌ని సృష్టించింది ఆమెరికా ఆర్మీయే అంటోంది. వాణిజ్య యుద్ధంలో తమతో గెలవలేక... అమెరికాయే కుట్ర పూరితంగా తమ దేశంలో ఈ వైరస్‌ని వ్యాపింపజేసిందని ఆరోపిస్తోంది. తాము బలమైన చర్యలు తీసుకోబట్టే వైరస్ ఆగిందనీ, అమెరికా అలా చెయ్యలేకపోగా... తమను నిందించడమేంటని ఎదురుప్రశ్నిస్తోంది.