కళ్యాణ్ రామ్ ఆ సినిమాని ఆపేసాడా ???

కళ్యాణ్ రామ్ ఆ సినిమాని ఆపేసాడా ???

జయాపజయాలతో సంబంధం లేకుండా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన తాత గారి పేరు పై స్థాపించిన  నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఈ మధ్య వేణు మల్లిడి అనే కొత్త దర్శ‌కుడు తో సోషియో ఫాంటసీ సినిమా తుగ్లక్ అనే స్క్రిప్ట్ ని ఒకే చేశారు. సంవత్సరం నుంచి ఈ కథ‌ పై వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా చెయ్యాలని తమిళ, హిందీ నటులని కూడా సంప్రదించారు.
ఏమైందో ఏమో ఇప్పుడు ఈ సినిమా ఆపినట్లు తెలుస్తోంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా సినిమా సంక్రాంతి కి రిలీజ్ అయ్యి.. పరాజయం అయ్యింది. ఇప్పుడు వేణు సినిమా చేస్తే రిస్క్ అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు రాజ్ తరుణ్ తో ఉయ్యాల జంపాల, నాని తో మజ్ను తీసిన దర్శకుడు విరించి వర్మ కూడా కళ్యాణ్ రామ్ తో సినిమా అనుకుని ఆరు నెలలు స్క్రిప్ట్ లో కూర్చున్న తర్వాత..  ఎంతమంచివాడవురా ప్రోజెక్టు రావడంతో విరించి వర్మ సినిమా క్యాన్సిల్ అయ్యింది.