సినిమా ట్వీస్ట్ లా రాజుగారి రెండో పెళ్లి ????

సినిమా ట్వీస్ట్ లా రాజుగారి రెండో పెళ్లి ????

ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ హాట్ గా వినిపిస్తోన్న వార్త దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరు ? అని రాజుగారి బంధువుల కంటే బయట జనాలకే అమ్మాయి ఎవరో  తెలుసుకోవాలనే అని ఆత్రుత ఎక్కువైంది. న్యూస్ కూడా రోజుకో రకంగా వస్తున్నాయి. దిల్ రాజు గారి భార్య అనిత కాలం చేసాక.. పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టారు దిల్ రాజు. ఐతే అయితే దిల్ రాజు కూతురు మిగతా ముఖ్య బంధువులు.. మరో పెళ్లి చెసుకోవడమే మంచిదని  దిల్ రాజుని ఒప్పించారట. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి ని కూడా అనుకుని అన్నీ మాట్లాడుకున్నారట.. ఫిబ్రవరి15 దుబాయ్ లో కళ్యాణం అనికూడా ఫిక్స్ అయ్యారని తెలిసింది. 

ఇదంతా బాగానే ఉంది, కానీ కథ‌ లో కొత్త ట్విస్ట్ వచ్చింది. అది ఏంటంటే గతంలో దిల్ రాజు నిర్మాణ సంస్థ లో హీరోయిన్ గా చేసిన రెండు అక్షరాల పేరు గల హీరోయిన్ తో ఆయనికి ప్రేమ పరిచయం ఉందని, అప్పటి నుంచీ ఆ రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుందనీ ప్రస్తుతం ఆ హీరోయిన్ సినిమాలు చెయ్యనప్పటికీ దిల్ రాజు నే నమ్ముకుని ఉందని.. ఇప్పుడు ఈ పెళ్లి వార్తలు వచ్చేసరికి మరొక్కసారి ఆ నటి వార్తల్లోకి వచ్చిందని అనుకుంటున్నారు. ఎప్పుడూ కథలు, సినిమాలతో బిజీగా ఉండే దిల్ రాజు శ‌త‌మానంభ‌వతి, శ్రీనివాస కళ్యాణం కథల్లో ట్విస్టుల్లా తన నిజ జీవితంలో వస్తున్న కథ లాంటి ఈ వార్త పై స్పందించకపోవడంపై జనాలు రకరకాలుగా గుసగుసలు మొదలెట్టారు.