ట్విటర్‌లో కేటీఆర్‌ ని ప్రశ్నించిన సినీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌

nag ashwin question to KTR

నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీదర్శకుడు మహానటి ఫేం నాగ్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్నా అశ్విన్ స్నేహితుడు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అతను మరణించాడు. ఈ అంశంపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ.. జరిగిన దారుణాన్ని వివరించారు.

‘ఆదివారం రోజు నా స్నేహితుడు గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. ప్రమాదం జరిగిన అనంతరం అతను మూడు గంటల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే నా సోదరి ఆదివారం రాత్రి ఉండే పరిస్థితిని వివరించింది. ఆసమయంలో డాక్టర్లు ఎందుకు ఉండరు?  రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషులు ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? కేటీఆర్ సార్ అంటూ వరుస ట్వీట్లతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.