డిస్నీ ప్లస్ మార్చి 29 న భారత్‌లో లాంచ్

డిస్నీ ప్లస్ మార్చి 29 న భారత్‌లో లాంచ్

అమెరికా సబ్ స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు డిస్నీ ప్లస్ ఇండియాకు వస్తోంది. భారతదేశ అత్యంత పాపులర్ స్ట్రీమింగ్ సర్వీసుదారు వాల్ట్ డిస్నీ కంపెనీ నుంచి స్ట్రీమింగ్ సర్వీసులో అధిక మొత్తంలో వాటాను కొనుగోలు చేసింది. వచ్చే ఐపీఎల్ 2020 సీజన్ ముందుగానే భారత వీడియో స్ట్రీమింగ్ మార్కెట్లోకి డిస్నీ ప్లస్ రానుంది. ప్రస్తుత ఆన్ లైన్ స్ట్రీమింగ్ సర్వీసుదారు హాట్ స్టార్ తో డిస్నీ ప్లస్ కంటెంట్ యాడ్ కానున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 29న డిస్నీ ప్లస్ క్యాటలాగ్ మొత్తాన్ని Hotstar ఇండియాకు తీసుకొస్తోంది. 

ఈ కంటెంట్‌లో మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్, డిస్నీ, పిక్సార్, నేషనల్ జియోగ్రాఫిక్, ఫ్రాంచైజీ స్టార్ వార్స్ వంటి వీడియో కంటెంట్ అందించనుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి రాబోయే అప్ కమింగ్ సిరీస్ ది ఫాల్కాన్, వింటర్ సోల్జర్, వాండా విజన్, లోకి కూడా అందించనుంది. ఈ ఏడాదిలో తర్వాత డిస్నీ ప్లస్ లో రిలీజ్ కానున్నాయి. భారత్ లోని హాట్ స్టార్ లో కూడా ఈ వీడియో కంటెంట్ అందుబాటులోకి ఉంటుంది. మార్చి 29న ఈ ఏడాది ఐపిఎల్ టోర్నమెంట్ ప్రారంభమయ్యే రోజున డిస్నీప్లస్ స్ట్రీమింగ్ సర్వీసు ఇండియాలో ప్రారంభమవుతుందని డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ ఇగెర్ చెప్పారు. 

భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటిగా మాత్రమే కాకుండా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. డిస్నీప్లస్‌లో ఇప్పుడు 28.6 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇది మూడు నెలల్లో కంపెనీకి ఒక మైలురాయి సాధించింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా మీడియా వినియోగం పెరిగేకొద్దీ డిస్నీప్లస్ సర్వీసులో ఇరత ఓటీటీ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్‌ను ప్రపంచ మార్కెట్లలో తీసుకురానుంది. డిస్నీప్లస్ కేటలాగ్ ప్రీమియం టైర్ సబ్ స్ర్కిప్షన్ ద్వారా అందించనుంది. ఇది ప్రస్తుత 'hotstar ప్రీమియం' పేరు నుండి 'డిస్నీ+ హాట్ స్టార్’ గా మారుతోంది. 'Hotstar VIP అని పిలువబడే ఇతర ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ కూడా రీబ్రాండ్ చేయనునుంది. 

ప్రస్తుతానికి, హాట్‌స్టార్‌లో డిస్నీ+ సర్వీసు కోసం సబ్ స్ర్కిప్షన్ ధరలను ప్రకటించలేదు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ డిస్నీ + కంటెంట్, హాట్‌స్టార్ ఒరిజినల్ ప్రోగ్రామింగ్‌ను కలిగి ఉంటుంది. అందుకే ఒక ఏడాదికి రూ .999 ధర నిర్ణయించే అవకాశం ఉంది. మరోవైపు హాట్‌స్టార్ VIPకి ఏడాదికి రూ .365 వరకు చెల్లించాల్సి ఉంటుంది. హాట్ స్టార్ యాప్.. గ్లోబల్ డిస్నీ+ యాప్ మాదిరిగానే మారే అవకాశం ఉంది.