స‌ర్వీసులు పున‌రుద్ధ‌రించిన ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు

స‌ర్వీసులు పున‌రుద్ధ‌రించిన ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు

 

  • గ్రాస‌రీ స‌ర్వీసులను  కొన్ని ప్రాంతాల్లో పునురుద్ధ‌రించిన ఈ కామ‌ర్స్ సంస్థ‌లు 
  • బిగ్ బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, గ్రోఫెర్స్ డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌ల‌కు ఐడెంటీ కార్డుల జారీ
  •  ఇండియా లాక్‌డౌన్ నేప‌థ్యంలో స‌ర్వీసుల‌కు రెండు రోజులు బ్రేక్ 
  • మిలియ‌న్ల‌లో పేరుకు పోయిన క‌స్ట‌మ‌ర్ల ఆర్డ‌ర్లు 
  • ఐడీ కార్డుల‌ను వెహిక‌ల్‌ పాస్‌గా  ఉప‌యోగించేందుకు పోలీసుల‌ అనుమ‌తి 

న్యూఢిల్లీ : ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీలైన బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్ కార్ట్‌, గ్రోఫెర్స్ లు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో త‌మ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించాయి. కిరాణా, నిత్యావ‌స‌ర స‌రుకుల డెలివ‌రీకి రెండు రోజుల పాటు విరామం ఇచ్చిన ప్ర‌ఖ్యాత ఈ కామర్స్ కంపెనీలు తిరిగి బుధ‌వారం నుంచి త‌మ సేవ‌ల‌ను పునరుద్ధ‌రించాయి.

 ఇండియాలో క‌రోనా వైర‌స్  వ్యాప్తి నిరోధించుట‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జ‌న‌తా క‌ర్ఫ్యూకి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ప‌లు ఈ కామ‌ర్స్ కంపెనీలు త‌మ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపి వేస్త‌న్న‌ట్లు ప్ర‌క‌టించాయి. రెండు రోజుల త‌ర్వాత తిరిగి త‌మ సేవ‌ల‌ను బిగ్‌బాస్కెట్ , ఫ్లిప్‌కార్ట్‌, గ్రోఫెర్‌లు ప్రారంభించాయి. రెండు రోజుల పాటు ఈకామ‌ర్స్ సంస్థ‌లు ఆర్డ‌ర్ల‌ను డెలివ‌రీ చేయ‌లేక పోవ‌డంతో మిలియ‌న్ల కొద్దీ ఆర్డ‌ర్లు పెండింగ్‌లో ఉన్నాయి. డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌లు నిరంత‌రం ప‌ని చేసినా వాటిని క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌డానికి నాలుగైదు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈ కామ‌ర్స్ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. 

కంపెనీల సేవ‌లు రెగ్యుల‌రైజ్ అయ్యేందుకు మ‌రో నాలుగు రోజులు ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించాయి. ఈ కామ‌ర్స్ సంస్థ‌ల డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌ల స‌ర్వీసుల‌కు అంత‌రాయం క‌లగ‌కుండా ఉండేందుకు సంస్థ గుర్తింపు కార్డులు మంజూరు చేశాయ‌ని, వాటిని ఫ్లాష్ చేయ‌డం ద్వారా వెహిక‌ల్ పాస్‌గా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని స‌దరు సంస్థ‌లు పేర్కొన్నాయి. 

 బిగ్ బాస్కెట్‌,  గ్రోఫెర్స్ సంస్థ‌లు ఇండియాలో త‌మ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించిన‌ సిటీల‌ జాబితాను ప్ర‌క‌టించాయి. ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ కంపెనీలు భార‌త‌దేశంలోని కొన్ని భాగాల్లో తిరిగి త‌మ స‌ర్వీసుల‌ను పునరుద్ధ‌రించాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ బుధ‌వారం నుంచి నిలిపివేసిన స‌ర్వీసుల‌ను తిరిగి 
కొన‌సాగించ‌నుంది. గ్రాస‌రీ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు కంపెనీ సీఈఓ క‌ళ్యాణ్ క్రిష్ణ‌మూర్తి ప్ర‌క‌టించారు. డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌ల‌కు చ‌ట్ట‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాత  ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

లాక్ డౌన్ స‌మ‌యంలో ఈ కామ‌ర్స్ ప‌నితీరుపై కేంద్ర‌ప్ర‌భుత్వానికి, రాష్ట్ర ప్ర‌భుత్వం,  స్థానిక అధికారులు ఇచ్చిన  వివ‌ర‌ణకు ఎంతో కృత‌జ్ఞ‌త‌ల‌ని ఆయ‌న అన్నారు. ఈ స‌మ‌యంలో భార‌తీయుల‌కు  అంకిత భావంతో ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, త‌మ‌పై ఎంతో న‌మ్మ‌కం ఉంచిన భార‌తీయుల‌కు ధ‌న్యావాదాల‌ని  క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు. 

నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రా అత్య‌వ‌సర‌మ‌ని చెప్పిన‌ప్ప‌టికీ , ప‌లు యాప్స్‌కు చెందిన డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌ల‌ను పోలీసులు వేధించ‌డం, స్థానిక గూండాల‌తో స‌మ‌స్య‌లు వ‌చ్చి కేసులు న‌మోదు కావ‌డంతో ఈ కామ‌ర్స్  స‌ర్వీసుల‌ను తాత్కాలికంగా నిలిపి వేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
 
ఏదిఏమైనా, ప్ర‌స్తుతం ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో  ఈ కామ‌ర్స్ దిగ్గ‌జాలు తిరిగి త‌మ స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించడం, ఇండియాలో ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌నేందుకు  శుభ‌సూచ‌కం. 

బిగ్‌బాస్కెట్ త‌న సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రించిన రాష్ట్రాల జాబితాను ప్ర‌క‌టించింది. అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, భోపాల్‌, ఇండోర్‌, ముంబై, నోయిడా, సూర‌త్‌, వ‌డోద‌ర‌, కోయంబ‌త్తూరుల్లో ప్రారంభించింది. అయితే అత్య‌ధిక డిమాండ్ ఉండ‌డం వ‌ల్ల మ‌రో నాలుగైదు రోజుల‌కు త‌ర్వాత కానీ స‌ర్వీసులు పూర్వ‌పు సాధార‌ణ స్థితికి చేర‌వ‌ని బిగ్‌బాస్కెట్ ప్ర‌క‌టించింది.

మ‌రి కొద్దిరోజుల పాటు స‌ర్వీసులు అందించ‌లేని సిటీల జాబితాను కూడా బిగ్‌బాస్కెట్ వెలువ‌రించింది. ఘ‌జియాబాద్‌, గుర్గాన్‌, హైద‌రాబాద్‌, జైపూర్‌, కోల్‌క‌తా, ల‌క్నో, నాగ్‌పూర్‌, పాట్నా, విజ‌య‌వాడ‌ల‌లో మ‌రి కొద్ది రోజుల పాటు బిగ్‌బాస్కెట్ సేవ‌ల కోసం వేచియుండాల్సిందే. ఏక్ష‌ణంలోనూ, స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించలేని న‌గ‌రాల జాబితాలో చండీగ‌ఢ్‌, చెన్నయి. ఢిల్లీ, లుథియానా, పూనే, వైజాగ్‌, కొచ్చిల‌ను ప్ర‌క‌టించింది.  

మ‌రో ప్ర‌ముఖ ఆన్‌లైన్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్  బెంగ‌ళూరు పోలీసుల‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  త‌మ సంస్థ‌కు చెందిన డెలివ‌రీ ఎగ్జిక్యూటివ్‌ల‌కు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడద‌ని హామీ తీసుకుంది. ఆహారం, మెడిస‌న్‌, గ్రాస‌రీస్‌, కూర‌గాయ‌లు, పండ్లు, జంతు సంబంధ ఆహార 
ఉత్ప‌త్తులకు సంంధించిన డెలివ‌రీ ఏజెంట్స్ రెప్ర‌జెంటేష‌న్ తో మీటింగ్‌కు హాజ‌రు కావ‌ల్సిందిగా బెంగ‌ళూరు సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ భాస్క‌ర్‌రావు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. 

 బెంగ‌ళూరుకు చెందిన ఎస్స‌న్షియ‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు  వెహిక‌ల్ పాస్ ల‌ను స్థానిక  డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో తీసుకోవాల‌ని సూచించింది బెంగ‌ళూరు సిటీ పోలీస్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 
లాక్‌డౌన్ స‌మ‌యంలో కూడా డెలివ‌రీ స‌ప్ల‌యి ఈ కామ‌ర్స్ ఏజెంట్ల  స‌ర్వీసుల‌కు  అంత‌రాయం క‌లిగించ‌బోమ‌ని గురుగ్రామ్ పోలీస్ విభాగం హామీనిచ్చింది.  

మ‌రో సూప‌ర్ బ‌జా ర్ కింగ్  గ్రోఫెర్స్ కూడా త‌మ స‌ర్వీసుల‌ను పునరుద్ధ‌రించిన న‌గ‌రాల జాబితా వెలువ‌రించింది. ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫ‌రీదాబాద్‌, ల‌క్నో, కాన్పూర్‌, బెంగ‌ళూరు. మ‌రో రెండు మూడు రోజుల్లో ముంబై, కోల్‌కతా, నోయిడా, హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, మొహ‌లి, గౌహ‌తి, పానిప‌ట్‌, 
దుర్గాపూర్‌, వ‌డోద‌ర‌, ఆసాన్‌స‌ల్‌, సోనిపాట్‌, రోహ‌త‌క్‌, భివాడి, ఆగ్రా, మీర‌ట్‌, మొరాదాబాద్‌, హాపుర్‌, మోడీన‌గ‌ర్‌, ప్ర‌యాగ్‌రాజ్‌, అలీఘ‌ర్ ప్రారంభించ‌నుంది. 

పూనే, చెన్న‌యి. చంఢీగ‌ర్‌ల‌లో స‌ర్వీసుల‌ను కొన‌సాగించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో అక్క‌డ స‌ర్వీసుల‌ను కొన‌సాగించేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని, అక్క‌డ పున‌రుద్ధ‌రించ‌డం జ‌ర‌గ‌ద‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది.