బందిపోరాలో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం

0
216
4 terrorists killed

జమ్మూకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో సోమవారం(జూన్-18) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టవద్దని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్స్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంజాన్ పండుగ ముగిసిన తర్వాత సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు  ఇంకా కొనసాగుతున్నాయి.

[penci_related_posts taxonomies=”undefined” title=”Related Posts” background=”” border=”” thumbright=”no” number=”4″ style=”list” align=”none” displayby=”cat” orderby=”random”]

జూన్ 14న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందగా, ఒక ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కదలికలను పసిగడుతున్న భద్రతా బలగాలు.. వారిని అంతమొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here