రేపటి నుంచి సందడి చేయనున్న ‘ఎఫ్‌ 2’

0
410
f2-fun-and-frustration-movie

ఎఫ్‌ 2 సందడి

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్‌ 2. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో వెంకటేష్‌, యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌లు కలిసి నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ‘మా చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. రేపటి నుంచి సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాము’ అని ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన అనిల్ రావిపూడి ‘రేపటి నుంచి ఎఫ్2 ఫన్ మొదలవుతుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే రేపటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

హిట్ ఖాయమన్న దిల్ రాజు

దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఆద్యంతం వినోదభరితంగా మలిచినట్టుగా తెలుస్తోంది. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ఒక్క ఫైట్ కూడా ఉండదని అంటున్నారు. రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ చూసిన దిల్ రాజు, చాలా హ్యాపీగా ఫీలయ్యారట. సంక్రాంతికి సరైన సినిమా ఇదేననీ .. ఈసారి హిట్ పడటం ఖాయమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి మరి.