ఎఫ్3 కి టైం ఫిక్స్ చేసిన దర్శక నిర్మాతలు...

ఎఫ్3 కి టైం ఫిక్స్ చేసిన దర్శక నిర్మాతలు...

 

గతేడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఎఫ్2.  వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాలో బలమైన కథ లేకున్నా, ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించి, సుమారు 80 కోట్ల వరకూ వసూళ్ళను రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తామని ఎఫ్ 2 విడుదల టైం నుంచి అటు దర్శకుడు అనిల్ రావిపూడి ఇటు నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి మరే ఇతర సినిమాకు కమిట్ అవ్వలేదు. దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ చేయబోయే సినిమా ఎఫ్ 3 అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తేజ్ లతో పాటు టైటిల్ ప్రకారం మరో హీరోని తీసుకునే ఆలోచనలో అనిల్  ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ చిత్రాల్లో నటించేందుకు రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. పైగా తనకు అచ్చొచ్చిన జానర్ కూడా అదే. 

అందుకే వీరి ముగ్గురితో కలిసి ఎఫ్ 3 చేసేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నాడు.అయితే తొలుత మహేష్ బాబుని తీసుకుంటారని సమాచారం అందగా అవన్నీ పుకార్లే అని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం 2020 ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని టాక్ నడుస్తోంది.