లక్నో స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి

0
179
fire at hotel in lucknow

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని ఓ స్టార్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం(జూన్-19) ఉదయం చార్‌బాగ్‌ ప్రాంతంలోని SSJ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న విరాట్‌ ఇంటర్నేషనల్‌ హొటల్‌లోకి కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మహిళ, ఒక చిన్నారితో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ నుంచి మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది …సుమారు 50 మందిని మంటల బారినుంచి రక్షించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here