ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..ఇద్ద‌రి మృతి

fire accident at mumbai
ముంబైలో ఫోర్ట్ ఏరియాలోని పటేల్ చాంబర్స్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు 18 ఫైరింజన్లు, 11 ట్యాంకర్లు, 150 ఫర్ ఆఫీసర్లు రంగంలోకి దిగాయి. శ‌నివారం(జూన్ -9) తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే సమయంలో బిల్డింగ్ కూలి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పటేల్ ఛాంబ‌ర్స్‌లో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అన్న విషయం కూడా తెలియడంలేదు. ముంబైలో ఒక్క వారం రోజుల్లోనే అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకోవడం ఇది రెండవది. సింథియా హౌజ్‌లో గత వారమే చివరి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ బిల్డింగ్‌లో చెలరేగిన మంటల్ని ఆర్పేందుకు అగ్ని ప్రమాపక అధికారులు చాలా సమయం పట్టింది. పరిస్ధితి అదుపులో ఉన్నట్లు తెలిపారు అధికారులు.